FIVE TONNES OF ORGANIC GROUND NUTS DONATED _ ఐదు టన్నుల వేరుశెనగ పప్పు విరాళం : టీటీడీ చైర్మన్ కు అందించిన దాత శ్రీ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి

Tirupati, 2 Jul. 20: A Nellore based devotee Sri Syamprasad Reddy has donated five tonnes of Ground nuts cultivated in his field through organic farming method to TTD Annaprasadam Trust on Thursday. 

The devotee hailing from Gudur of Sri Potti Sriramulu Nellore District has handed over the stock to TTD Chairman Sri YV Subba Reddy in Sri Padmavathi Rest House and expressed his immense pleasure for donating the organic yield cultivated in his own farm field. 

TTD Additional EO Sri AV Dharma Reddy was also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ఐదు టన్నుల వేరుశెనగ పప్పు విరాళం : టీటీడీ చైర్మన్ కు అందించిన దాత శ్రీ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి
 
తిరుపతి, 2020  జూలై  02: నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శ్రీ పి.శ్యామ్ ప్రసాద్ రెడ్డి టిటిడి అన్నదానం ట్రస్ట్ కు ఐదు టన్నుల వేరుశెనగ పప్పు విరాళంగా అందించారు. గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి వీటిని అందించారు. 
 
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి తన సొంత భూమిలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వేరుశెనగ పప్పు విరాళంగా ఇవ్వడం సంతోషమన్నారు. అదనపు ఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.