ఎస్వీ బధిర పాఠశాలలో ఘనంగా బధిరుల దినోత్సవం

ఎస్వీ బధిర పాఠశాలలో ఘనంగా బధిరుల దినోత్సవం

తిరుపతి, సెప్టెంబరు 26, 2013: తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాలలో బధిరుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే విద్యాశాఖాధికారి శ్రీ పి.వి.శేషారెడ్డి మాట్లాడుతూ వికలత్వం అభివృద్ధికి అడ్డుకాదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని అన్నారు. బధిర విద్యార్థులకు ఈ సంర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బధిర విద్యార్థులకు విద్యాబుద్ధులు అందిస్తున్న ఇక్కడి ఉపాధ్యాయులను, సిబ్బందిని ఆయన అభినందించారు. తితిదే ఉన్నతాధికారుల సూచనల మేరకు పాఠశాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా బధిర విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శ్రీమతి ఎ.నళిన, బోధన, బోధనేతన సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.