TTD EO INSPECTS BRAHMOTSAVAMS ARRANGEMENTS _ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను తణిఖీ చేసిన తి.తి.దే ఇ.ఓ
TIRUMALA, SEPT 26: The TTD Executive officer Sri MG Gopal on Thursday inspected the ongoing arrangements for the upcoming mega religious event of annual brahmotsavams along with Tirumala JEO Sri KS Sreenivasa Raju.
As a part of the inspection, TTD EO thoroughly inspected New Golden Chariot Mandapam, various Vahanams in Vaibhavotsava Mandapam, New Golden Tiruvasi-Makaratoranam, old golden chariot, Kalyana vedika where expos by different departments are being displayed etc.
The EO also visited the Narayanagiri peak where the new set of Srivari Padalu are being laid, the foundation stone to be laid by the hon’ble CM Sri N Kiran Kumar Reddy for the estimated Rs.70cr Srivari Seva building complex coming up opposite Varahaswamy Guest House, Tiruvenkatapatham road, Common Luggage Centre in PAC IV.
Earlier speaking to media persons, he said, the arrangements are on a spree as the annual brahmotsavams are fast approaching. “All the arrangements are in place. There will be a trial run of the new golden chariot on September 30 before it is used during Swarnarathotsavam in brahmotsavams”, he added.
SE II Sri Ramesh Reddy, Additional CVSO Sri Sivakumar Reddy and other officials were also present.
బ్రహ్మోత్సవ ఏర్పాట్లను తణిఖీ చేసిన తి.తి.దే ఇ.ఓ
తిరుమల, 26 సెప్టెంబరు 2013 : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 5 వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు జరుగనున్న నేపథ్యంలో తిరుమలలో విస్తృతంగా జరుగుతున్న వివిధ ఏర్పాట్లను గురువారం ఉదయం తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీ యం.జి. గోపాల్, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజుతో కూడి పలు ప్రాంతాలను పరిశీలించారు.
దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ తణిఖీలో నూతనంగా నిర్మిస్తున్న బంగారు రథం మండపాన్ని, వైభవోత్సవ మండపంలో ఉంచబడిన బ్రహ్మోత్సవాల వాహనాలను, కొత్తగా తయారుచేయబడుతున్న వాహన బంగారు మకరతోరణనాన్ని (తిరువాసి) పరిశీలించారు. అనంతరం పాత బంగారు రథాన్ని పరిశీలించారు. నారాయణగిరిపై ఇటీవల నూతనంగా నిర్మితమవుతున్న శ్రీవారి పాదాల పనులను తణిఖీ చేశారు. కల్యాణవేదికలో వివిధ విభాగాలవారు ఏర్పాటు చేయనున్న ప్రదర్శన శాలలను పరిశీలించారు.
బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన అక్టోబరు 5వ తేదిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి చేతులమీదుగా శంఖు స్థాపన జరుగునున్న శ్రీవారి సేవాసదన్ భవన సముదాయాన్ని, యాత్రికుల వసతి సముదాయం.4 (పి.ఎ.సి-4) ఉమ్మడి లగేజి కేంద్రాన్ని, తిరువేంకటపథాన్ని పరిశీలించారు. ఈ నిర్మాణాలపై తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు, ఎస్.ఇ.2 శ్రీ రమేశ్‌రెడ్డి ఇ.ఓకు వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు సి.వి.ఎస్.ఓ శ్రీ శివకుమార్ రెడ్డి, అరోగ్యశాఖాధికారి శ్రీ వెంకటరమణ, అటవీశాఖాధికారి శ్రీ వెంకటస్వామి, ఎస్టేట్ అఫీసర్ శ్రీ దేవేందర్ రెడ్డి ఇతర తి.తి.దే అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.