SV MUSEUM WORKS INSPECTED _ ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి-టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి
Tirumala, 27 July 2026: TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary inspected the ongoing development work at the SV Museum in Tirumala on Monday evening.
He directed the officials concerned to complete them before the ensuing annual Srivari Brahmotsavams.
He stressed that the galleries should be aesthetically developed and appear spiritually enriching for devotees.
The Additional EO asked officials to make arrangements for parking, mobile phone deposit counters, and footwear storage for pilgrims.
Chief Museum Officer in charge and Dy EO Health Sri Somannarayana, SE Sri Venugopal and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి
తిరుమల, 2026 జూలై 27: ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లోపు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఎస్వీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యూజియంలోని గ్యాలరీలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మ్యూజియం బయట పార్కింగ్, మైబైల్ కౌంటర్లు, పాద రక్షకాలు భద్రపరచే కేంద్రాల ఏర్పాటు గురించి పలు సూచనలు చేశారు.
ఈ పరిశీలనా కార్యక్రమంలో టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఎస్ఈ శ్రీ వేణు గోపాల్, ఎలక్ట్రికల్ డిఈ శ్రీ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


