ఎస్వీ యోగధ్యాన కేంద్రం నందు డిప్లామా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

ఎస్వీ యోగధ్యాన కేంద్రం నందు డిప్లామా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

తిరుపతి, 2010 జూన్‌ 15: తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీవేంకటేశ్వర యోగధ్యాన కేంద్రము 2010-2011 విద్యా సంవత్సరమునకు యోగడిప్లామా, యోగసర్టిఫికేట్‌ కోర్సులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

ఒక సంవత్సరము కాలపరిమితిగల యోగ డిప్లామాకోర్సులో చేరదలచినవారు కనీస అర్హతగా ఏదేని బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండవలెను. అదేవిధంగా 3 నెలలు కాలపరిమితి గల యోగసర్టిఫికెట్‌ కోర్సులో చేరదలచినవారు కనీస అర్హతగా 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండవలెను.

పై కోర్సులు రాష్ట్రీయ సంస్కృత యూనివర్సిటి, తిరుపతి వారిచే గుర్తింపబడినది. చేరదలచిన అభ్యర్థులు పాత ప్రసూతి ఆసుపత్రి నందు గల శ్రీవేంకటేశ్వర యోగథ్యయన కేంద్రం నందు రూ.20/- చెల్లించి దరఖాస్తులను పొందవచ్చును. జూలై 1వ తేది నుండి దరఖాస్తులను విక్రయిస్తారు. జూలై 31వ తేదిలోపు అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆగష్టు 2వ తేది నుండి తరగతులు ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాలకు 0877-2264607, 0877-2264730 నెంబర్లను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.