PART-TIME COURSES IN SVMC _ ఎస్వీ సంగీత కళాశాలలో పార్ట్ టైమ్ కోర్సులలో  ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Tirupati, 28 May 2023: TTD invited applications from interested candidates to apply for part-time courses in SV College of Music and Dance upto June 20.

 

For Certificate Course the minimum qualification is a fifth pass and the age limit is 10 years by June 30 with a fee of Rs. 2000. And for Diploma the age should be 14 with a fee of Rs. 2,200 while for Kala Pravesika the age is eight years with a fee of Rs. 1,500.

 

The applications shall be procured from the office of the college during working days on a payment of Rs. 50.

 

For more details contact 08772264597, 9848374408 and 9440793205

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఎస్వీ సంగీత కళాశాలలో పార్ట్ టైమ్ కోర్సులలో  ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
 
తిరుపతి, 2023 మే 28: శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో సాయంత్రం (పార్ట్  టైమ్)  కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి జూన్‌ 20వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 
 
సాయంత్రం కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, మృదంగం, వయోలిన్‌, భరతనాట్యం, కూచిపూడి, హరికథ, ఘటం విభాగాలున్నాయి. ఇందులో సర్టిఫికెట్ కోర్సుకు 5వ తరగతి ఉత్తీర్ణులై ,10 సంవత్సరాలు  వయసు(జూన్ 30వ తేదీకి) కలిగి ఉండాలి. రూ.2000/- ఫీజు చెల్లించాలి. డిప్లమో కోర్సుకు సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై, 14 సంవత్సరాల వయసు, రూ.2,200/- ఫీజుగా నిర్ణయించారు. కళా ప్రవేశిక కోర్సుకు 8 సంవత్సరాల వయసు కలిగి, రూ.1500/- ఫీజు చెల్లించాలి.
 
ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందవచ్చు . జూన్‌ 14 వతేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్వ్యూలు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. జూన్ 21వ తేదీ నుండి తరగతులు ప్రారంభిస్తారు.
 
ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264597, 9848374408, 9440793205 నంబర్ల లో  సంప్రదించగలరు. 
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది