APPLICATIONS INVITED FOR EVENING COURSES AT SV TRADITIONAL SCULPTURE COLLEGE _ ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో సాయంత్రం కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
Tirupati, 18 December 2023: TTD has called for applications from eligible students for evening courses at the Sri Venkateswara Traditional Architecture College for the academic year 2023-24.
The new one-year certificate courses introduced for evening session includes Traditional KalamKari art and Basics in Temple Sculpture for students.
Interested men and women with qualifications of 10th class pass and no age limit shall submit before the evening of December 31 at the college.
For more details contact Principal SV Traditional Temple Architecture College, Alipiri Road, near Balaji link bus stand.
Those from Tirupati shall contact 0877-2264637, or mobile 9866997290.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో సాయంత్రం కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
తిరుపతి, 2023 డిసెంబరు 18: శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను సాయంత్రం కోర్సులలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరడమైనది.
ఏడాది కాలం శిక్షణ కలిగిన సర్టిఫికేట్ కోర్సులైన “సంప్రదాయ కళంకారి కళ” మరియు “శిల్పకళల యందు ప్రాథమిక అంశాలు (Basics in Sculpture)” అనే కోర్సులు నూతనంగా ప్రవేశ పెట్టబడినవి.
ఈ కోర్సుల యందు ప్రవేశం పొందేందుకు ఆసక్తి కలిగిన మహిళలు, పురుషులకు కళాశాలలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులనుడిసెంబరు 31వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది. కోర్సులో ప్రవేశం పొందేందుకు 10 వ తరగతి పాసై ఉండాలి. వీరికి గరిష్ట వయో పరిమితి లేదు.
ఇతర వివరముల కొరకు ప్రిన్సిపాల్, ఎస్వీ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ కళాశాల, అలిపిరి రోడ్, బాలాజీ లింక్ బస్ స్టాండ్ ప్రక్కన, తిరుపతి వారిని కానీ , 0877-2264637, మొబైల్ నెం.9866997290 ను సంప్రదించగలరు
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.