NAAC A GRADE FOR SGS-CHAIRMAN, EO LAUDS _ ఎస్ జి ఎస్ కళాశాలకు న్యాక్ ఎ గ్రేడ్

TIRUMALA, 30 NOVEMBER 2022: The TTD-run SGS Arts College received NAAC A Grade to which the TTD Chairman Sri YV Subba Reddy along with the TTD EO Sri AV Dharma Reddy lauded the efforts of the faculty and the students for achieving the prestigious grading.

They also appreciated TTD JEO for Health and Education Smt Sada Bhargavi and her team comprising Devasthanans Education Officer Sri Bhaskar Reddy, Special Officer Education Sri Govindarajan, Principal Sri Venugopal Reddy who met the Chairman-EO duo at Annamaiah Bhavan in Tirumala on Wednesday evening after the board meeting.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్ జి ఎస్ కళాశాలకు న్యాక్ ఎ గ్రేడ్
– టీటీడీ చైర్మన్, ఈవో ద్వారా పత్రాలు అందుకున్న ప్రిన్సిపాల్

తిరుమల 30 నవంబరు 2022: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ గోవింద రాజ స్వామి జూనియర్ కళాశాలకు న్యాక్ ఎ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఇటీవల కళాశాలను సందర్శించిన న్యాక్ కమిటీ ఈ మేరకు పత్రాలను టీటీడీ కి పంపింది. బుధవారం రాత్రి తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి ద్వారా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ సర్టిఫికెట్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవో టీటీడీ జేఈవో (విద్య, వైద్యం) శ్రీమతి సదా భార్గవి, కళాశాల అధ్యాపకులను అభినందించారు. డి ఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, డిప్యూటి ఈవో శ్రీ గోవింద రాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది