TTD FOREST STAFF BEING TRAINED IN DIVERTING ELEPHANTS FROM HABITATS TO FORESTS _ ఏనుగులను దారి మళ్ళించడం పై అటవీ సిబ్బందికి శిక్షణ
Tirupati, 19 Feb. 22: In the recent backdrop of some pachyderms entering into the public places from forest regions in Sheshachala, TTD forest officials, Supervisors etc. were given a special training program at SVETA Bhavan on Saturday.
The training session was conducted by eminent elephant psychologist Dr Rudra Aditya from Himachal Pradesh.
Conducting theory sessions in the morning and field sessions in the post-lunch the visiting expert emphasised that whenever elephants entered habitats making noise or throwing stones would not help.
He demonstrated a procedure of making smoke with dried chillies in Gunny bags and tie them to a bamboo stick, each in a gap of ten meters and the spicy smell would help drive away from the animals.
In case of rains, same procedure shall be followed to spread spicy fog by tying the chilli loaded boxes to the trees. He also advised forest workers to not wear a white and red dress which agitate the pachyderms and should wear green coloured apparels only.
He advised that in the event of elephants chasing they should not climb a tree but run zig zag. He enlightened the TTD forest staff on the mid set of elephants during all seasons and how to deal with the situation.
In charge DFO Smt and SVETA Director Smt Prashanti, Range officers Sri Prabhakar Reddy, Sri Venkata Subbaiah, Sri Raghurami Reddy, Sri Swamy Vivekananda were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఏనుగులను దారి మళ్ళించడం పై అటవీ సిబ్బందికి శిక్షణ
– ఏనుగుల మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్ రుద్ర ఆదిత్య చే క్షేత్ర స్థాయి అవగాహన శిక్షణ
తిరుపతి 19 ఫిబ్రవరి 2022: తిరుమల అటవీ ప్రాంతంలో ఇటీవల ఏనుగులు సంచరించిన నేపథ్యంలో టీటీడీ అటవీశాఖ అధికారులు, మేస్త్రీ లకు శ్వేత లో శనివారం ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత ఏనుగుల మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్ రుద్ర ఆదిత్య ఈ శిక్షణ ఇచ్చారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు థియరీ గురించి వివరించి కొన్ని వీడియోలు చూపించారు. సాయంత్రం శ్వేత ప్రాంగణంలోని పార్కులో క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏనుగులు జనావాసం లోకి వచ్చినప్పుడు గట్టిగా అరవడం, రాళ్ళతో కొట్టడం లాంటివి చేయకూడదన్నారు.
పచ్చి వెదురు బొంగుకు గన్నీ బ్యాగ్, ఎండు మిరపకాయలు ఒక క్రమపద్ధతిలో చుట్టి మంటపెట్టి కొంతసేపటి తరువాత పొగవచ్చేలా చేసే ప్రక్రియ చేసి చూపించారు. ఇలాంటి వాటిని ప్రతి 10 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసే ఆ వాసనకు ఏనుగులు వెనక్కు వెళ్ళి పోతాయని చెప్పారు.
వర్షాలు కురుస్తుంటే చెట్టుకు ఒక డబ్బాకట్టి అందులో పిడకలు, ఎండుమిరపకాయలువేసి మంట పెట్టినా ఏనుగులు ఆ వాసనకు ముందుకు రాలేవని చూపించారు. తెలుపు, ఎరుపు రంగులు ఏనుగులను ఆగ్రహం తెప్పిస్తాయని అందువల్లే అడవుల్లో పనిచేసేవారు, సందర్శకులు ఈ రంగు వస్త్రాలు ధరించరాదన్నారు.
అడవుల్లో ఉండే వారు ఆకుపచ్చ రంగు వస్త్రాలు వేసుకోవడం శ్రేయస్కరమని డాక్టర్ రుద్ర ఆదిత్య తెలిపారు. ఏనుగు వెంటపడేప్పుడు చెట్టు ఎక్కరాదని, ఒకే దశలో కాకుండా జిగ్ జాగ్ గా పరుగెత్తాలన్నారు. ఏనుగు ఎదురు పడినప్పుడు భయంతో కేకలు వేయకుండా తెలివిగా తప్పించుకునే మార్గం చూడాలని చెప్పారు. వీటితో పాటు ఏనుగులు ఏ సమయంలో ఏ వాతావరణం లో ఎలాంటి మనస్తత్వం తో ఉంటాయి, వాటిని ఎలా డీల్ చేయాలనే విషయాలపై శిక్షణ ఇచ్చారు.
ఇంచార్జ్ డి ఎఫ్ ఓ, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, రేంజ్ ఆఫీసర్లు శ్రీ ప్రభాకర్ రెడ్డి, శ్రీ వెంకట సుబ్బయ్య, శ్రీ రఘురామిరెడ్డి, శ్రీ వివేకానంద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది