UGADI FETE IN MAHATI _ ఏప్రిల్ 13న మహతిలో ఉగాది సంబరాలు
Tirupati, 11 Apr. 21: Plavanama Samvatsara Ugadi will be observed jointly in Mahati Auditorium in Tirupati by the HDPP and Welfare departments of TTD on Tuesday, April 13 following Covid guidelines.
Special programs like Panchanga Shravanam by eminent scholar Sri Gopavajjhala Balasubramanya Shastry, fancy dress show portraying ancient characters by the children of TTD employees, Ugadi Pacchadi distribution will be part of event.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 13న మహతిలో ఉగాది సంబరాలు
తిరుపతి, 2021 ఏప్రిల్ 11: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 13వ తేదీ తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా శ్రీ గోపావఝల బాలసుబ్రమణ్యం శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తారు.
అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లలతో తెలుగు వైతాళికుల వేషధారణ పోటీలు నిర్వహిస్తారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాద వితరణ ఉంటుంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.