ఏప్రిల్‌ 13న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మత్స్య జయంతి

ఏప్రిల్‌ 13న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మత్స్య జయంతి

తిరుపతి, ఏప్రిల్‌  10, 2013: నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 13వ తేదీన మత్స్య జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ వేదనారాయణస్వామి మూలవర్లకు అభిషేకం జరుగనుంది. అనంతరం మత్స్య జయంతి ఉత్సవం(తిరువీధి ఉత్సవం) నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 8.30 నుండి 10.30 గంటల వరకు గరుడ వాహన తిరువీధి ఉత్సవం జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.