ఏప్రిల్‌ 15 నుండి 24వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఏప్రిల్‌ 15 నుండి 24వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, ఏప్రిల్‌ 01, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభి రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 15 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరుగను న్నాయి. ఏప్రిల్‌ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణం జరుగనుంది. ప్రతిరోజూ స్వామివారు పలు వాహనాల్లో ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
తేదీ ఉదయం రాత్రి
15-04-2013(సోమవారం) ధ్వజారోహణం గజవాహనం
16-04-2013(మంగళవారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం
17-04-2013(బుధవారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం
18-04-2013(గురువారం) సర్వభూపాలవాహనం శేషవాహనం
19-04-2013(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభవాహనం, మోహినీ అవతారోత్సవం
20-04-2013(శనివారం) తిరుచ్చి ఉత్సవం   కల్యాణోత్సవం, గరుడ వాహనం
21-04-2013(ఆదివారం) రథోత్సవం ధూళి ఉత్సవం
22-04-2013(సోమవారం) తిరుచ్చి ఉత్సవం     అశ్వవాహనం, పార్వేట ఉత్సవం
23-04-2013(మంగళవారం) వసంతోత్సవం, హంస వాహనం,
చక్రస్నానం ధ్వజావరోహణం
24-04-2013(బుధవారం) స్నపన తిరుమంజనం పుష్పయాగం
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.