ఏప్రిల్ 23 నుండి శ్రీ కోదండరాములవారి తెప్పోత్సవాలు
ఏప్రిల్ 23 నుండి శ్రీ కోదండరాములవారి తెప్పోత్సవాలు
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాలు ఏప్రిల్ 23 నుండి 26వ తేదీ వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 10.00 నుండి 11.30 గంటలకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు తెప్పలపై స్వామివారు విహరిస్తారు. మొదటిరోజైన ఏప్రిల్ 23న ఐదు చుట్లు, రెండో రోజైన ఏప్రిల్ 24న ఏడు చుట్లు సీతారాములు తెప్పలపై విహరించనున్నారు. ఏప్రిల్ 25వ తేదీ చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు తెప్పోత్సవం ఉండదు. మరుసటి రోజైన ఏప్రిల్ 26న స్వామివారు పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తెప్పలపై విహరిస్తారు. భక్తులందరూ తెప్పోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
–
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.