ఏప్రిల్‌ 26న సత్రవాడ శ్రీ కరి వరదరాజస్వామి ఆలయంలో చిత్రాపౌర్ణమి

ఏప్రిల్‌ 26న సత్రవాడ శ్రీ కరి వరదరాజస్వామి ఆలయంలో చిత్రాపౌర్ణమి

నగరి సత్రవాడలోని శ్రీ కరి వరదరాజస్వామి ఆలయంలో ఏప్రిల్‌ 26వ తేదీన చిత్రాపౌర్ణమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం తిరువరాధన, తిరువీధి ఉత్సవం అనంతరం మధ్యాహ్నం ఉత్సవమూర్తులను ఉద్యానవనంలోకి తీసుకు రానున్నారు. సాయంత్రం 5.00 గంటలకు స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, నెయ్యి, పండ్లరసాలతో స్వామివారికి అభిషేకం చేయనున్నారు. సాయంత్రం 7.00 గంటల నుండి ఉద్యానవనంలో ధార్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 10.00 గంటలకు ఉద్యానవనం నుండి ఉత్సవమూర్తులను తిరిగి ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకురానున్నారు. అనంతరం రాత్రి కైంకర్యాలు జరుగనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.