SEVENTH CONVOCATION OF SV VEDIC UNIVERSITY ON APRIL 28 _ ఏప్రిల్ 28న వేద విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవం

AP GOVERNOR TO TAKE PART IN CHANCELLOR CAPACITY

 

550 STUDENTS TO GET CERTIFICATES

 

Tirupati,26 April 2023:  Acharya Rani Sadasiva Murthy, the vice chancellor of Sri Venkateswara Vedic  University announced on Wednesday that the 7th  convocation of the university will be held at 11 am on April 28th at the Mahati Auditorium in Tirupati.

 

During a press conference in the varsity, he said 550 students from certificate courses to PhD will be given certificates besides Maha Mahopadhyaya and Vachaspati titles to two eminent scholars in each on the occasion.

 

The vice chancellor said the university was established in 2006 for protecting and propagating vedas had achieved stellar progress under the leadership of TTD Chairman Sri YV Subba Reddy and TTD EO Sri AV Dharma Reddy.

 

He said the honourable Governor of AP Sri Abdul Nazeer besides will participate.

 

TOP HONOUR

 

He said Brahmarshi Sri V Subramanya Shastri, Ghanapati of Hyderabad and Brahmarshi Sri Ramachandra Mani Dravida Shastri of Chennai will be presented  Maha Mahopadhyaya titles.

 

Similarly, Brahmarshi Kapilavai Ram Somayaji Shastri of Annavaram and Brahmarshi C Vamsi Krishna Ghanapati of Mysore will be presented the Vachaspati titles on the occasion.

 

OUR PROGRESS

The vice chancellor also highlighted the contributions made in the realm of teaching,facilitation and ambience at the university and that from 2023-24 the national education policy will be implemented in the university after deliberating over last few months.

 

Among others including MA courses in grammar and Law translation courses from Sanskrit to English,super sensory knowledge purses Diploma courses in Yoga, occult courses, organising Navagraha Shila gardens ,Yajna Oushadi gardens  etc as part of environmental courses.

 

PRESERVATION OF PALM LEAF DOCUMENTS

 

The vice chancellor said the TTD manuscripts projects was engaged in the digitisation and preservation of palm leaf documents collected at TTD and the state archaeology department. He also said now the TTD has technology for the preservation of such documents for the next 500 years.

The university will soon commence a course for the study and translation of these palm leaf documents, he added.

 

University Registrar Acharya Radheshyam, TTD PRO Dr T Ravi, University PRO Acharya Brahmacharya and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 28న వేద విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవం

– 550 మంది విద్యార్థులకు పట్టాలు ప్రధానం

– ఇద్దరికి మహామహోపాధ్యాయ, ఇద్దరికి వాచస్పతి పురస్కారాలు

ప్రధానంవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి

తిరుపతి 26 ఏప్రిల్ 2023: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవం ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 11 గంటలకు మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి తెలిపారు. సర్టిఫికెట్ కోర్సుల నుండి పి హెచ్ డి దాకా కోర్సులు పూర్తి చేసుకున్న 550 మంది విద్యార్థులకుఈ సందర్భంగా పట్టాలు బహూకరిస్తామన్నారు. అలాగే ఇద్దరికి మహామహోపాధ్యాయ, ఇద్దరికి వాచస్పతి పురస్కారాలు ప్రధానం చేస్తామని ఆయన వివరించారు.

విశ్వవిద్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వేద పరిరక్షణ, వేద ప్రచారం కోసం టీటీడీ 2006 లో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం స్థాపించిందన్నారు. గతం పని చేసిన ఉప కులపతుల ఆధ్వర్యంలో సాధించిన ప్రగతిని మరింత పెంచడం కోసం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి సహకారం, మార్గదర్శనంలో విశ్వవిద్యాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకు వెళుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 28వ తేదీ 7వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయం కులపతి, రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి స్నాతకోత్సవంలో పాల్గొంటున్నారని తెలిపారు.

వీరికి అత్యున్నత పురస్కారాలు

తమ జీవితాన్ని వేద విద్య వ్యాప్తికి, వేద పరిరక్షణకు అంకితం చేసిన హైదరాబాద్ కు చెందిన బ్రహ్మశ్రీ వి. సుబ్రహ్మణ్య శాస్త్రి ఘనపాటి, చెన్నై కి చెందిన బ్రహ్మశ్రీ రామచంద్ర మణి ద్రావిడ శాస్త్రి కి మహామహోపాధ్యాయ అత్యున్న పురస్కారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

వేదంలో మంచి ప్రావీణ్యం ఉండి వేద పరిరక్షణకు కృషి చేస్తున్న అన్నవరం కు చెందిన బ్రహ్మశ్రీ కపిలవాయి రామ సోమయాజి శాస్త్రి, మైసూరు కు చెందిన బ్రహ్మశ్రీ సి. వంశీకృష్ణ ఘన పాటి కి వాచస్పతి పురస్కారం తో సన్మానిస్తామని ఉపకులపతి ప్రకటించారు.

ఇదీ ప్రగతి

వేద విశ్వవిద్యాలయం లో బోధన పరంగా, వసతుల కల్పన, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసే అంశాలకు సంబంధించి అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 2023- 24 విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా విధానం ( నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) అమలు చేస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా భోధనాంశాల్లో మార్పులు, చేర్పుల కోసం మూడు నెలలుగా కసరత్తు చేసినట్లు ఆచార్య రాణి సదాశివమూర్తి వివరించారు. వ్యాకరణం, న్యాయ విభాగాల్లో ఎం ఎ కోర్సులు ప్రవేశ పెడుతున్నామన్నారు. సంస్కృతం నుండి ఆంగ్లం, తెలుగు భాషల్లోకి అనువాదాలు చేయడం కోసం అనువాద అభ్యసన కోర్సులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. వివిధ ధ్యాన ప్రమాణాలు- ప్రాచీన మనో విజ్ఞాన విశేషాలు సమాజానికి అందించడానికి సూపర్ సెన్సరీ నాలెడ్జ్ కోర్సులు ప్రారంభిస్తామని తెలిపారు. దీంతోపాటు యోగ లో ప్రస్తుతం సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నామని, ఇకపై డిప్లమా కోర్సులు ప్రారంభిస్తామని చెప్పారు.

పర్యావరణ పరిరక్షణ కోసం విశ్వవిద్యాలయం పరిధిలో యజ్ఞ, ఓషధీ, ఏక విసంతి పత్ర, నక్షత్ర, నవగ్రహ, శిలా వనాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. వీటితో పాటు యాగశాల, యోగ శాల నిర్మిస్తున్నామన్నారు.

తాళ పత్రాల పరిరక్షణ కోసం….

టీటీడీ ఆధ్వర్యంలో తాళ పత్ర గ్రంథాల పరిరక్షణ కోసం మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్టు నిర్వహిస్తోందని ఉపకులపతి తెలిపారు. ఎస్వీ విశ్వవిద్యాలయం, పురావస్తు శాఖల వద్ద ఉన్న తాళ పత్రాలను స్కాన్ చేసి డిజిటైజ్ చేస్తున్నామన్నారు. అలాగే దేశంలో ఎవరైనా తమవద్ద ఉన్న తాళ పత్రాలను తమకు అందిస్తే వాటిని డిజిటైజ్ చేసి దాతకు ఇవ్వడంతో పాటు అసలు తాళ పత్రాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 500 సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరకుండా ఉండేలా వాటిని భద్ర పరుస్తామన్నారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బంకర్లు నిర్మించి, లాకర్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

అలాగే తాళ పత్రాలను చదివి, అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా డిప్లమా, సర్టిఫికెట్ కోర్సు ప్రారంభిస్తామని చెప్పారు.

విశ్వవిద్యాలయం రిజిస్టార్ ఆచార్య రాధేశ్యాం, టీటీడీ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ రవి, విశ్వవిద్యాలయం ప్రజాసంబంధాల అధికారి ఆచార్య బ్రహ్మా చార్యులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది