ఏప్రిల్ 4 నుండి మహారాష్ట్రలో రెండు చోట్ల శ్రీనివాస కల్యాణాలు
ఏప్రిల్ 4 నుండి మహారాష్ట్రలో రెండు చోట్ల శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి, మార్చి 30, 2013: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 4వ తేదీ నుండి మహారాష్ట్రలో రెండు చోట్ల శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 4న పుణె నగరంలోని స్వార్ గేట్ సమీపాన గల మహర్షి నగర్ సౌభాగ్య మంగళ కార్యాలయ మైదానంలో నవ బృందావన్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా జరుగనుంది. అదేవిధంగా ఏప్రిల్ 7న విరార్ నగరంలో శ్రీ సాయిధామ్ మందిర్ ట్రస్టు ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ కె.రామకృష్ణ ఈ కల్యాణాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.