TTD GEARS UP FOR VONTIMITTA KALYANAM ON APRIL 5 _ ఏప్రిల్ 5న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణం
SPECIAL CULTURAL PROGRAMMES
SVBC TO LIVE TELECAST THE EVENT
VONTIMITTA, 03 APRIL 2023: On the auspicious occasion of the mega religious event of Sri Sita Rama Kalyanam at Vontimitta in YSR Kadapa District on April 5, TTD has come out with a series of religious, traditional, cultural and devotional events on the day.
As a part of the ongoing annual brahmotsavams at Vontimitta Sri Kodanda Ramalayam, the event will take place between 8pm and 10pm on April 5 at Kalyana Vedika. Sri Venkateswara Bhakti Channel of TTD will live telecast the State Festival of Sri Sita Rama Kalyanam for the sake of global devotees.
In the evening between 4.30pm and 5.30pm, Sri Rama Namamritam, a devotional cultural programme will be presented by the artists of the Annamacharya Project, followed by Dance ballet by the students of SV College of Music and Dance under the supervision of the Principal Dr Uma Muddubala between 6.15pm and 7.45pm.
The divine wedding ceremony commence at 8pm. Before that, “Kanta Korika”, followed by Edurkolu Utsavam will be observed. Bhagavat Vignapanam, Sabha Anugna, Sankalpam for the welfare of humanity will be performed. Later Punyahavachanam, Rakshabandhanam, Yagnopaveetadharanam, Varapresanam or Kanyavaranam, Madhuparkarchanam, Maha Sankalam followed by Kanyadanam, Vamsawaroopam, Agnipratishtapanam, Mangalastakam will be rendered.
The series of wedding proceedings includes Mangalya Pooja, Mangalasutra Dharana, Akshataropanam, followed by Nivedana, Veda Swasti, and concludes with Mahadaseervachanam. At 11pm, Gaja Vahana Seva will be observed.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 5న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణం
– ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు
– ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం
ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 03: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5న బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. కల్యాణవేదిక వద్ద రాత్రి 8 నుండి 10 గంటల వరకు కల్యాణం నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
కల్యాణోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కలిసి శ్రీరామ నామామృతం భజన కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 6.15 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఉమా ముద్దుబాల పర్యవేక్షణలో శ్రీరామకృతులు నృత్య కార్యక్రమం నిర్వహిస్తారు.
అదేవిధంగా కాంతకోరిక నిర్వహిస్తారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలుసుకోవడాన్ని కాంతకోరిక అంటారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవం చేపడతారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు.
రాత్రి 8 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమవుతుంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయిస్తారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహిస్తారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేస్తారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదువుతారు. వంశస్వరూపాన్ని స్తుతిస్తారు. అగ్నిప్రతిష్టాపన తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠిస్తారు.
ఆ తరువాత మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేస్తారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్తవుతుంది. కల్యాణం అనంతరం రాత్రి 11 గంటలకు గజవాహన సేవ నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.