ఏప్రిల్ 5న తితిదేలో డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు
ఏప్రిల్ 5న తితిదేలో డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు
తిరుపతి, ఏప్రిల్ 04, 2013: తన అవిశ్రాంత పోరాటంతో దళితుల జీవితాల్లో వెలుగురేఖలు నింపిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 106వ జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్ ఐదో తేదీ శుక్రవారం ఘనంగా నిర్వహించనుంది. తితిదే పరిపాలనా భవనం ప్రాంగణంలో ఉదయం 10.00 గంటలకు జయంతి సభ ప్రారంభం కానుంది. తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం అధ్యక్షతన జరుగనున్న ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు పాల్గొననున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.