DARSHAN FOR THE AGED AND PHYSICALLY CHALLENGED FROM APRIL 9 ONWARDS _ ఏప్రిల్ 8వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు

ONLINE QUOTA TO RELEASE ON APRIL 8

NO ANGA PRADAKSHINA ON FRIDAYS -TTD

TIRUMALA, 31 MARCH 2022: The online quota for the month of April for the physically challenged and aged people will be release by TTD on April 8 at 11 am.

This category of darshan was dispensed with by TTD a couple of years ago following Covid Pandemic. As the situation now turned to normalcy, the darshan for the aged, differently-abled and devotees suffering from chronic diseases is set to resume from April 9 onwards.

However, the pilgrims falling under this category have to book in online to avoid the inconvenience of darshan. On Fridays they will be provided darshan at 3pm while remaining days at 11 am.

The devotees are requested to make note of this.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 8వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు

తిరుమల, 2022 మార్చి 31: వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టోకెన్ల కోటాను ఏప్రిల్ 8వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. సాఫ్ట్‌వేర్‌లో ఏర్ప‌డిన సాంకేతిక స‌మ‌స్య వ‌ల్ల ఏప్రిల్ 1వ తేదీకి బ‌దులుగా ఏప్రిల్ 8వ తేదీకి ద‌ర్శ‌న టోకెన్ల‌ను వాయిదా వేశారు.

రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఏప్రిల్ 9వ తేదీ నుండి నిర్దేశించిన స్లాట్‌లో వీరిని ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో రెండేళ్ల త‌రువాత వృద్ధులు, దివ్యాంగుల ప్ర‌త్యేక ద‌ర్శ‌నాన్ని టిటిడి పున‌రుద్ధ‌రించింది.

కాగా, వీరిని ప్ర‌తిరోజూ ఉద‌యం 10 గంట‌ల స్లాట్‌లో దివ్యాంగుల క్యూలైన్ ద్వారా ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. శుక్ర‌వారం నాడు మాత్రం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్ కేటాయించారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైనది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.