ఏఫ్రిల్ 17 నుండి 19 వరకు బాలాలయ సంప్రోక్షణ
ఏఫ్రిల్ 17 నుండి 19 వరకు బాలాలయ సంప్రోక్షణ
తిరుపతి, ఏప్రిల్-15, 2009: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏఫ్రిల్ 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తారు. అంకురార్పణం ఏఫ్రిల్ 16న నిర్వహిస్తారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో శ్రీకోదండరామస్వామి వారిని భక్తులు దర్శించుకోవచ్చును. ఈ రోజులలో శ్రీ కోదండరామస్వామివారి మూలవర్ల దర్శనం ఉండదు. నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్.కోటేశ్వరరావు అను భక్తుడు తితిదేకి చెందిన కాటేజి డొనేషన్ స్కీమ్నకు 10లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చిన్నారు. ఈ డి.డిని ఆయన తి.తి.దే. ఇ.ఓ గారికి శుక్రవారం అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.