JAMBAVANTA STATUE AT VONTIMITTA KALYANA VEDIKA _TTD JEO _ ఒంటిమిట్ట కల్యాణ వేదిక వద్ద జాంబవంతుని విగ్రహం ఏర్పాటు _ టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం

SRI VARI TEMPLE AT ANNAMAIAH STATUE PREMISES BY NEXT JAN _ TTD JEO

TIRUPATI, 07 DECEMBER 2022: A statue dedicated to Jambavanta, one of the prime characters in epic Ramayana will be set up soon in the premises near Kalyana Vedika at Vontimitta, said TTD JEO Sri Veerabrahmam.

JEO on Wednesday accompanied by CE Sri Nageswara Rao inspected the ongoing development works at Vontimitta, Annamaiah statue, and Devuni Kadapa for the ensuing New Year and Vaikunta Ekadasi and in general.

He instructed the officials concerned to increase the darshan timings on these important days for devotees.

The JEO also directed the concerned to prepare an action plan to construct necessary structures near Kalyana Vedika to perform marriages.

At 108 feet statue of Annamaiah, he discussed with the officials about the ongoing works of the Srivari temple under construction. He directed them to get the temple ready by January end next.

In Devuni Kadapa temple he made some valuable suggestions to the concerned officials for the ensuing new year and  Vaikunta Ekadasi.

He also discussed bringing up the Pilgrims Amenities Complex for the utilization of devotees.

Deputy EO Sri Natesh Babu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఒంటిమిట్ట కల్యాణ వేదిక వద్ద జాంబవంతుని విగ్రహం ఏర్పాటు

– భక్తులకు అందుబాటులోకి కల్యాణ వేదిక
– జనవరి చివరకు అన్నమయ్య విగ్రహం ఆవరణంలో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి

టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 7 డిసెంబరు 2022: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం కల్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో జాంబవంతుని విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు. బుధవారం ఆయన అధికారులతో కలసి ఒంటిమిట్టలో టీటీడీ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జనవరి 1వ తేదీ , వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్ల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ రోజుల్లో దర్శనం సమయం కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట లోని కల్యాణ వేదిక వద్ద అవసరమైన నిర్మాణాలు చేపట్టి భక్తులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

అంతకుముందు ఆయన రాజంపేటలో శ్రీ అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు . ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం పనుల గురించి అధికారులతో చర్చించారు. జనవరి చివరినాటికి ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇక్కడ జరుగుతున్న వేదిక నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జేఈఓ శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

అన్నమయ్య విగ్రహం పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలన్నారు.

అనంతరం జేఈవో శ్రీ వీరబ్రహ్మం దేవుని కడప శ్రీ లక్షీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. జనవరి 1వ తేదీ, వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల దర్శనం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఇక్కడ నిర్మించిన వసతి సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చే విషయంపై అధికారులతో చర్చించారు.

టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది