SRIVARI SEVAKS PARTICIPATION KNOWS NO BOUNDARIES _ ఒంటిమిట్ట శ్రీ రాములవారి కల్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం

Vontimitta, 17 April 2024: The role of Srivari Sevaks rendering voluntary service in Vontimitta Sri Kodanda Ramalayam is gaining popularity akin to Tirumala.

Hundreds of sevaks are coming forward with enthusiasm to participate in rendering services to fellow pilgrim devotees in various areas like serving Annaprasadam, distribution of buttermilk and water, pilgrim crowd management etc.at Vontimitta during the annual Brahmotsavams.

The popularity of the state festival of Sri Sita Rama Kalyanam at Vontimitta Kodanda Ramalayam has spread across Andhra Pradesh.

With this the devotees not only from Kadapa and Annamaiah districts but also from Kurnool, Rajamundry and other districts are seen participating voluntarily as Srivari Sevaks.

Sharing the same to media on Wednesday, on the occasion of preparation of Talambralu, JEO Sri Veerabrahmam said.

TTD has invited services of 500 sevaks every day while drafted another 1200 exclusively for Sri Sita Rama Kalyanam on April 22. Besides, another 300 are deployed for the preparation of Talambralu. It is nice to see the voluntary participation of devotees enrolling themselves as Srivari Sevaks, especially for the celestial wedding ceremony, he added.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ రాములవారి కల్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం

– రాములవారి సేవ‌లో శ్రీ‌వారి సేవ‌కులు

ఒంటిమిట్ట‌, 2024 ఏప్రిల్ 17: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 22న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో బుధ‌వారం తలంబ్రాల ప్యాకింగ్‌ను జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ, శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న ముత్యాల‌ త‌లంబ్రాల ప్యాకింగ్ కార్య‌క్ర‌మం శ్రీవారి సేవకులతో ప్రారంభించిన‌ట్లు తెలిపారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చార‌న్నారు. శ్రీ సీతా రామ కళ్యాణం కోసం తలంబ్రాల తయారీకి అవసరమయ్యే పసుపు వినియోగించేందుకు ఏప్రిల్ 13న‌ పుసుపు దంచే కార్యక్రమం నిర్వ‌హించామ‌న్నారు. ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్న‌ట్లు చెప్పారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు.

క‌డ‌ప‌, అన్న‌మ‌య్య జిల్లాలతో పాటు క‌ర్నూలు, రాజ‌మండ్రి నుండే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందించేందుకు శ్రీ‌వారి సేవ‌కులు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 1.20 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబిసి సిఈవో శ్రీ ష‌ణ్ముఖ కుమార్‌, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి ప్రశాంతి, శ్రీ హ‌రికృష్ణ‌, శ్రీ గుణ భూష‌ణ్‌ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.