OFFICIALS INSPECT KALYANA VEDIKA _ రాములవారి కల్యాణోత్సవం ఏర్పాట్లు పరిశీల‌న

VONTIMITTA, 17 APRIL 2024: TTD officials along with various department officials from the Kadapa district inspected the ongoing arrangements in Kalyana Vedika at Vontimitta on Wednesday afternoon.

Earlier both the TTD JEO Sri Veerabrahmam and Kadapa Joint Collector Sri Ganesh Kumar reviewed the arrangements with various officials from both the areas with respect to galleries, traffic diversion, parking slots, Annaprasadam and water distribution, security, transportation after the completion of Kalyanam on April 22.

Later they visited Kalyana Vedika and made some valuable suggestions to the officials concerned on announcements for guiding devotees in a proper manner on various facilities etc.

All the officials from TTD and district administration were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

రాములవారి కల్యాణోత్సవం ఏర్పాట్లు పరిశీల‌న‌

ఒంటిమిట్ట‌, 2024 ఏప్రిల్ 17: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం రోజున భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ గ‌ణేష్ కుమార్ క‌లిసి బుధ‌వారం పరిశీలించారు.

కల్యాణ వేదిక వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్యాలరీల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులు ఇతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు. కడప జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది పటిష్ట బందోబస్తు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా, వాహనాల పార్కింగ్‌, భక్తుల అవసరాలకు తగినన్ని ఆర్ టిసి బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కళ్యాణ వేదిక వద్ద బారికేడ్లు, అన్న ప్రసాదము కౌంటర్లు, లైటింగ్, వైద్యశిబిరాలు, మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ధ్య సిబ్బంది తదితర అంశాలపై సమీక్షించారు.

అంత‌కుముందు ఒంటిమిట్ట ఆలయం వద్దగల పరిపాలన భవనంలో జేఈవో టీటీడీ, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ స‌మావేశంలో క‌డ‌ప జిల్లా అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శ్రీ మౌర్య భ‌ర‌ద్వాజ్‌, అద‌న‌పు ఎస్పీ శ్రీ వెంక‌ట‌రాముడు, ఎస్వీబిసి సిఈవో శ్రీ ష‌ణ్ముఖ కుమార్‌, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వెంకటేశ్వర్లు, విజివో శ్రీ బాలిరెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీ రాజేంద్ర ఇతర అధికారులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.