CULTURAL PROGRAMMES ALLURES _ కపిలతీర్థంలో అలరించిన డా.పరమేశ్వరయ్య గాత్ర సంగీతం
TIRUPATI, 14 FEBRUARY 2023: The devotional cultural programmes arranged by TTD on the occasion of the ongoing annual brahmotsavams in Kapileswara Swamy temple have been attracting devotees to a great extent.
As part of it on Tuesday evening, the Vocal, Harikatha, Flute, Nadaswaram and Dolu performances by the artistes of SV College of Music and Dance enthralled the devotees.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కపిలతీర్థంలో అలరించిన డా.పరమేశ్వరయ్య గాత్ర సంగీతం
తిరుపతి, 2023 ఫిబ్రవరి 14: శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద మంగళవారం నిర్వహించిన సంగీత కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ముందుగా హరికథ గానం జరిగింది. అనంతరం ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ హరిబాబు బృందం నాదస్వరం, శ్రీ నాగేశ్వరరావు బృందం డోలు వాయిద్యాలతో మంగళధ్వని వినిపించారు. అదేవిధంగా డా.పరమేశ్వరయ్య బృందం శ్రావ్యంగా గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించారు.
వీరికి వయోలిన్ శ్రీ ఎం సురేంద్ర, మృదంగం శ్రీ రఘురాం, కీబోర్డ్ శ్రీ మురళి, తబల శ్రీ నటరాజ సహకరించారు.
అంతకుముందు శ్రీ ఎ . చెన్నయ్య బృందం ప్రదర్శించిన వేణు గాన వాయిద్య విన్యాసం భక్తులను ఆకట్టుకుంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.