SUBRAMANYA HOMAM COMMENCES _ కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభం
TIRUPATI, 28 OCTOBER 2022: As part of the ongoing month-long Homa Mahotsavams in Sri Kapileswara Swamy temple in Tirupati, Subramanya Swamy Homam commenced on Friday. This will continue till October 30.
In the evening of October 30, Valli Devasena sametha Sri Subramanya Swamy Kalyanam will be performed between 5:30pm and 7:30pm.
కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభం
తిరుపతి, 2022 అక్టోబరు 28: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా ప్రారంభమైంది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.
కాగా, అక్టోబరు 29, 30వ తేదీల్లో కూడా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం జరుగనుంది. ఇందులో భాగంగా అక్టోబరు 30న సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ శ్రీనివాసులు, సూపరింటెండెంట్లు శ్రీ భూపతి, శ్రీ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలక్రిష్ణ, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.