కపిలేశ్వరాలయంలో కొబ్బరి చిప్పల తరలింపునకు కొటేషన్లు ఆహ్వానం

కపిలేశ్వరాలయంలో కొబ్బరి చిప్పల తరలింపునకు కొటేషన్లు ఆహ్వానం

తిరుపతి, ఏప్రిల్‌  23, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తులు సమర్పించిన కొబ్బరి చిప్పలను ఏడాది పాటు తీసుకెళ్లేందుకు కాంట్రాక్టర్ల నుండి సీల్డ్‌ కొటేషన్లు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గలవారు ఏప్రిల్‌ 24 నుండి 30వ తేదీ లోపు కొటేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంపికైన కాంట్రాక్టరుకు ఏడాది పాటు కొబ్బరి చిప్పలు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇతర వివరాలకు కపిలేశ్వరాలయ పర్యవేక్షకుడిని సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.