PADMAVATI RIDES KALPAVRUKSHA VAHANA IN SRI RAJAMANNAR ALANKARAM _ కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో సిరుల తల్లి

Tirupati, 23 November 2022: Goddess Sri Padmavati blessed devotees on the fourth day of the ongoing Karthika Brahmotsavam in Sri Rajamannar alankaram riding the Kalpavruksha vahana.

Goddess strode on the four Mada streets amidst Mangala vadyam, Kolatas and bhajans by devotees blessing devout between 08.00-10.00 am as devotees presented karpoora. Harati at every step.

Legends highlighted the significance of Kalpavruksha which bestowed boons to devotees.

Later in the afternoon, grand Snapana Thirumanjanam was performed for the utsava idols of Goddess Padmavati and later Unjal seva in the evening after special decorations and alankaram to Goddess.

The Goddess will ride on Hanumanta vahana at night and bless devotees.

Tirumala pontiffs, Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, TTD EO Sri AV Dharma Reddy couple,TTD board member and Chandragiri MLA Sri Checireddy Bhaskar Reddt couple, JEO Sri Veerabrahmam couple. DyEO Sri Lokanatham, Agama adviser Sri Srinivasa Charyulu, VGOs Sri Manohar and Sri Bali Reddy, AEO Sri Prabhakar Reddy, temple Archakas Sri Babuswamy, Superintendent Sri Madhu and arjita inspector Sri Damu were present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో సిరుల తల్లి

తిరుపతి, 2022 నవంబరు 23: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం అమ్మవారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో చ‌ర్నాకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించారు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.

మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

అలాగే రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, ఈవో శ్రీ ఎవి ధర్మా రెడ్డి దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసచార్యులు, విఎస్‌వోలు శ్రీ మనోహర్, శ్రీ బాలి రెడ్డి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరిండెంట్ శ్రీ మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.