SRI RAMA RIDES KALPAVRIKSHA _ కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
TIRUPATI, 02 APRIL 2022: As part of the ongoing annual brahmotsavams of Sri Kodanda Rama Swamy temple in Tirupati, Kalpavriksha Vahanam took place.
Sri Kodanda Rama in all His celestial splendour took a ride on the divine tree carrier along the Mada streets to bless His devotees.
Special Grade Deputy EO Smt Parvati, AEO Sri Durgaraju and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
తిరుపతి, 2022 ఏప్రిల్ 02: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు.
వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.