KALPAVRIKSHA VAHANAM HELD _ కల్పవృక్ష వాహనంపై సోమస్కందమూర్తి
TIRUPATI, 17 FEBRUARY 2023: On the seventh day morning Sri Somaskanda Murty put a celestial ride on the finely decked Kalpavriksha Vahanam on Friday morning.
Later Snapana Tirumanjanam was held under the supervision of Kankanabhattar Sri Udaya Swamy.
Temple DyEO Sri Devendra Babu and others were also present.ial DyEO Smt Varalakshmi, AEO Sri Gurumurty and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కల్పవృక్ష వాహనంపై సోమస్కందమూర్తి
తిరుపతి, 17 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి కల్పవృక్ష వాహనంపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) శాస్త్రోక్తంగా జరుగుతోంది. కంకణభట్టార్ శ్రీ ఉదయాస్వామి ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహిస్తున్నారు.
ఈసందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం, పన్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు.
ఆ తరువాత రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.