కాంట్రాక్టు పరిచారికలు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల పోస్టులకు

కాంట్రాక్టు పరిచారికలు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల పోస్టులకు

జూలై 18 నుండి 20వ తేదీ వరకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు

తిరుపతి, 2012 జూలై 04: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒప్పంద ప్రాతిపదికన పరిచారికలు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లుగా పనిచేసేందుకు గాను ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.

తిరుపతిలోని శ్వేత భవనంలో ఉన్న సంచాలకుల కార్యాలయంలో ఉదయం 11.00 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి.

కాంట్రాక్టు పరిచారిక అభ్యర్థులకు జూలై 18వ తేదీన, కాంట్రాక్టు పోటు వర్కర్లకు జూలై 19వ తేదీన, కాంట్రాక్టు ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు జూలై 20వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.

అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలియజేయడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.