కాంట్రాక్టు మెడికల్‌ ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కాంట్రాక్టు మెడికల్‌ ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, సెప్టెంబరు 08, 2013: తితిదే ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీల్లో మెడికల్‌ ఆఫీసర్లుగా కాంట్రాక్టు పద్ధతిపై ఒక సంవత్సర కాలానికి ఎం.బి.బి.ఎస్‌ విద్యార్హతతో ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.

అర్హులైన వారికి సెప్టెంబరు 27వ తేదీన ఉదయం 10.30 గంటలకు తిరుపతిలోని తితిదే శ్వేత భవనంలో వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమతోపాటు బయోడేటా, విద్యార్హతల అసలు పత్రములు, జిరాక్స్‌ కాపీలు, రెండు స్టాంపు సైజు ఫొటోలు తీసుకురావాలి. అభ్యర్థులు సెప్టెంబరు 27వ తేదీన ఉదయం 9.30 నుండి 10.30 గంటల మధ్య తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి జి.ఓ.ఎంఎస్‌. నంబరు.459 ప్రకారం వేతనము, కరువుబత్యము మాత్రమే ఇవ్వబడును. ప్రభుత్వం సూచించిన మేరకు రిజర్వేషన్లు పాటిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది