ID CARDS ISSUED TO CORPORATION EMPLOYEES _ కార్పొరేషన్ ఉద్యోగులకు గుర్తింపు కార్డుల జారీ ప్రారంభం

SERVE LORD BY SERVING DEVOTEES- TTD JEO(H & E)

Tirupati, 21 January 2023: The employees should serve the Lord Venkateswara by serving His devotees in discharging their duties with utmost dedication and devotion, said TTD JEO(H & E) Smt Sada Bhargavi.

TTD JEO launched the issuance of Identity cards to the employees of various TTD departments who were appointed through Sri Lakshmi Srinivasa Manpower Corporation(SLSMPC) on Saturday evening at Sri Padmavati Rest House in Tirupati.

Speaking on the occasion TTD JEO said the outsourcing employees whose earlier appointments were through various agencies and societies, have been brought under one Corporation now to have better facilities which included Earn Leaves, ID cards, subsidy laddus, quarters allotment on a rent of Rs.1000 etc, personal accident coverage of ₹5 lakhs, Srivari Darshan for families etc. 

All these guidelines were formulated by erstwhile TTD EO Dr KS Jawahar Reddy and the present EO Sri AV Dharma Reddy keeping in view the welfare of the employees.

Corporation CEO Sri Shailendra said henceforth all outsourced manpower requirements of TTD will be met through the SLSMPC providing timely salaries and job security etc. and urged the employees to serve the Lord with dedication and discipline.

TTD PRO Dr T Ravi and Corporation staff were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తుల్లో భగవంతుడిని చూడండి

– టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి

– కార్పొరేషన్ ఉద్యోగులకు గుర్తింపు కార్డుల జారీ ప్రారంభం

తిరుపతి, 21 జనవరి 2023: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను భగవంతుడితో సమానంగా చూడాలని, వారితో గౌరవ మర్యాదలతో వ్యవహరించి మెరుగైన సేవలు అందించాలని టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి కార్పొరేషన్ ఉద్యోగులను కోరారు. టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో చేరిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గుర్తింపు కార్డుల జారీని జెఈఓ ప్రారంభించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన దాదాపు 30 మంది కార్పొరేషన్ ఉద్యోగులకు జెఈఓ చేతుల మీదుగా గుర్తింపు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ టిటిడిలో వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనం ఇతర సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అప్పటి ఈవో శ్రీ జవహర్ రెడ్డి, ప్రస్తుత ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో కార్పొరేషన్ ఉద్యోగులకు మేలు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఆర్జిత సెలవులు వర్తింపచేశామని, ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే రూ.5 లక్షల ఇన్సూరెన్స్  కల్పించామని, గ్రాట్యూటీ చెల్లిస్తామని తెలియజేశారు. అదేవిధంగా గుర్తింపు కార్డుతో సుపథం మార్గం ద్వారా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించామని, రూ.20 చొప్పున నెలకు 10 లడ్డూలు సబ్సిడీపై పొందే అవకాశం ఇచ్చామని తెలియజేశారు. ఇటీవల వేతనాలు కూడా పెంచామన్నారు. నెలకు రూ.1000 అద్దెతో క్వార్టర్స్ కేటాయించామని, త్వరలో వీటికి మరమ్మతులు పూర్తి చేసి ఉద్యోగులకు అందిస్తామని తెలియజేశారు.

కార్పొరేషన్ సీఈఓ శ్రీ శేష శైలేంద్ర మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం టిటిడి యాజమాన్యం ఎంతో ఉన్నతంగా ఆలోచించి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. టిటిడికి అవసరమైన అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఇకపై కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేసి అందజేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతినెలా ఒకటో తేదీలోపే ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాల సొమ్ము జమ చేస్తున్నట్టు తెలిపారు. కార్పొరేషన్ ఉద్యోగులు క్రమశిక్షణతో నిజాయితీగా పనిచేసి సంస్థకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి పిఆర్ఓ డా. టి.రవి, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.