TTD JEO INSPECTS COVID CARE CENTRE _ కోవిడ్ కేర్ సెంటర్లను పరిశీలించిన జెఈవో శ్రీమతి సదా భార్గవి

Tirupati, 08 September 2021: TTD JEO Smt Sada Bhargavi on Wednesday evening inspected Tondavada and Padmavati Nilayam Covid care Centers, which were key to store medicines and provide food to all other Covid care centres at Srinivasam, Vishnu Nivasam and Madhavam.

 

The JEO inspected and reviewed the quality of food and medical services provided to Covid patients besides the inward and outward registers in the stores at the Covid care centres.

 

Speaking to staff later the JEO instructed them not to retain extra stocks of food materials and medicine at the centres. The officials informed the JEO that while 282 patients were housed at Sri Padmavati Nilayam, 131 were at Tondavada Centre.

 

She noted the existence of surplus staff present at the Covid care Centres and made valuable suggestions to doctors, medical staff and catering staff.

 

Catering Officer Sri GLN Shastri, TTD Canteen DyEO Sri Lakshmana Naik, Additional Health officer Dr Sunil, Dr Bharat and other medical staff were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కోవిడ్ కేర్ సెంటర్లను పరిశీలించిన జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 8 సెప్టెంబరు 2021: తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయం తోపాటు తొండవాడ సమీపంలోని కోవిడ్ కేర్ సెంటర్లను టీటీడీ తిరుపతి జేఈవో శ్రీమతి సదా భార్గవి బుధవారం పరిశీలించారు.

పద్మావతి నిలయం, శ్రీనివాసం, విష్ణునివాసం, తొండవాడ వద్ద ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ల లో చికిత్స పొందుతున్న రోగులకు అందించే ఆహారం తయారీకి అవసరమైన సరుకులు టీటీడీ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలు, భోజనాల నాణ్యతను ఆమె పరిశీలించారు. స్టోర్స్ లో టీటీడీ నుంచి వచ్చిన సరుకుల రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో సిబ్బందితో మాట్లాడుతూ, కోవిడ్ కేర్ సెంటర్లకు నెలవారీగా ఎన్ని సరుకులు వస్తున్నాయి, ఎన్ని ఉపయోగిస్తున్నారనే వివరాలను పరిశీలించారు. అవసరానికి మించి సరుకులను నిల్వ ఉంచుకోరాదని సిబ్బందికి ఆమె సూచించారు. పద్మావతి నిలయంలో 282 మంది, తొండవాడ దగ్గర ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ లో 131 మంది రోగులు ఉన్నట్లు సంబంధిత అధికారులు వివరించారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి  జెఈవో తెలుసుకున్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో అవసరానికి మించి సిబ్బంది ఉన్నారని ఆమె గమనించారు.

ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బంది, అన్నదానం సిబ్బందికి ఆమె పలు సూచనలు చేశారు క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ శాస్త్రి, క్యాంటీన్స్ డిప్యూటీ ఈవో శ్రీ లక్ష్మణ్ నాయక్ , అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, డాక్టర్ భరత్ తో పాటు వైద్య విభాగం అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారి జారీ చేయబడింది