EXTENSIVE ARRANGEMENTS BY TTD FOR CAMPAIGN AGAINST CORONA VIRUS _ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు టిటిడి విస్తృత ఏర్పాట్లు

Tirumala, 17 Mar. 20: On directions of TTD EO Sri Anil Kumar Singhal and in the supervision of Additional EO Sri AV Dharma Reddy, TTD has made systematic and extensive arrangements for tackling the spread of corona Virus at Tirumala.

TIME SLOT FOR TOKENS FOR SRIVARI DARSHAN: 

From zero hours of Tuesday, March 17, TTD has commenced issue of time slot tokens for direct Srivari darshan without any waiting in the Vaikuntam queue complex. TTD set up various counters at Tirumala and Tirupati to issue tokens.

ANNA PRASADAM:

Only 500 devotees were accommodated in each dining hall of Annaprasadam    Complex as against normal seating capacity of 1000 for each hall at the rate of two pilgrims per table instead of four. The staff and sevaks wore masks and sanitized their hands at regular intervals while serving Annaprasadam to pilgrims.

KALYANA KATTA:

Tonsuring is done quickly at all kalyana kattas in Tirumala without any waiting. All barbers have worn masks and used Dettol solutions and the tonsuring halls cleaned up every 2 hours.

ACCOMODATION:

All rest houses, cottages, PACs and guesthouses were cleaned up with additional cleaning staff and pilgrims were allowed into rooms, one hour after cleaning.

HEALTH:

All thickly populated junctions are cleaned with disinfectants against infectious diseases and sanitizers.

Awareness camps were organised for all TTD employees and senior officials. All staff posted in the Tirumala provided masks and sanitizers.

A control room was also set up at Tirumala health office and devotees could. Intact 0877-2263447 for emergencies and corona virus awareness information.

MEDICAL:

All vehicles passing through Alipiri checkpoint are sprayed with anti infectious disinfectants. 

Emergency Medical camps were set up at Alipiri padala mandapam, Srivari Mettu walker’s path with thermal screening facility. 

TTD has offered to all ₹300 darshan online advance ticket holders an option to postpone to future dates or else refund if they cancel visits.

In order to completely avoid waiting period anywhere TTD has cancelled Arjita sevas like vishesha puja, Sahasra kalasabhisekam and Vasantotsavams.

EXTENSIVE PUBLICITY 

TTD is making non-stop announcements and telecast on corona virus awareness measures on SVBC channel and Radio and broadcasting services. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు టిటిడి విస్తృత ఏర్పాట్లు
 
తిరుమల, 2020 మార్చి 17: తిరుమ‌ల‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ ఆదేశాల మేర‌కు అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి పర్యవేక్షణలో టిటిడిలోని అన్ని విభాగాలు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టింది.  ఇందులో భాగంగా 
 
టైంస్లాట్ టోకెన్లు ద్వారా శ్రీ‌వారి ద‌ర్శ‌నం –
 
శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 12.00 గంట‌ల నుండి టైంస్లాట్ టోకెన్లు జారీ చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 మ‌రియు 2ల‌లో  వేచి ఉండ‌కుండా నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించారు. 
 
అన్న‌ప్ర‌సాదం  – 
 
తిరుమ‌ల‌లోని త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో ఒక్కొక్క హాలులో 1000 మంది భోజ‌నం చేసే అవ‌కాశం ఉన్న‌, 500 మందికి మాత్ర‌మే భోజ‌నం అందిస్తున్నారు. ఇందులో ఒక టేబుల్‌కు న‌లుగురు కుర్చోవ‌ల‌సి ఉండ‌గా ఇద్ద‌రికి మాత్ర‌మే భోజ‌నం ఏర్పాటు చేశారు. ఉద్యోగులు అంద‌రు మాస్కులు ధ‌రించి, శానిటైజ‌ర్ల‌తో చేతుల‌ను ఏప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకుంటున్నారు. అదేవిధంగా తిరుమ‌ల‌లోని వివిద ఫుడ్ కౌంట‌ర్ల‌ల‌లోను మాస్కులు ధ‌రించి అన్న‌ప్ర‌సాదాలు పంపీణి చేస్తున్నారు. 
 
క‌ల్యాణ క‌ట్ట –  
 
తిరుమ‌ల‌లోని ప్ర‌ధాన క‌ల్యాణ‌క‌ట్ట‌తో పాటు వివిద ప్రాంతాల‌లోని 9 మినీ క‌ల్యాణ‌ క‌ట్ట‌ల‌లో భ‌క్తులు వేచి ఉండ‌కుండా స‌త్వ‌రం త‌ల‌నీలాలు స‌మ‌ర్పించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. క‌ల్యాణ క‌ట్ట‌ల‌లోని క్షుర‌కులకు మాస్కులు, డెటాల్‌, సొల్యూష‌న్‌ అందించారు. ప్ర‌తి 2 గంట‌ల‌కోసారి ప‌రిశుభ్ర‌త(శానిటైజ్‌) చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌ధాన క‌ల్యాణ క‌ట్ట‌లో ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 
 
వ‌స‌తి విభాగం – 
 
తిరుమ‌ల‌లోని వ‌స‌తి గృహ‌లు, అతిథి భ‌వ‌నాలు, వ‌స‌తి స‌మూదాయాల‌లో (పిఏసిలు) అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేసి శుభ్రం చేస్తున్నారు. వ‌స‌తి గ‌దులను భ‌క్తులు ఖాళీ చేసిన త‌రువాత ఒక గంట పాటు స‌రైన విధంగా శుభ్రం చేసిన త‌రువాత మ‌రొక‌రికి కేటాయిస్తున్నారు.      
 
ఆరోగ్య విభాగం – 
 
టిటిడి ఆరోగ్య విభాగాధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉన్న ప్రాంతాల‌లో శానిటైజర్లు, ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి అంటు రోగ నివార‌ణ మందుల‌తో ప‌రిస‌రాల‌ను శుభ్రం చేస్తున్నారు. అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్య సామ‌గ్రిని ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తున్నారు.  టిటిడిలోని అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి అవగాహన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. తిరుమ‌ల‌లో విధులు నిర్వ‌హించే ఉద్యోగులంద‌రికి మాస్కులు, శానిటైజర్లు అందించారు. 
 
అలిపిరి చెక్‌పాయింట్ నుండి తిరుమ‌ల‌కు వ‌చ్చే వాహ‌నాల‌పై అంటు రోగ నివార‌ణ మందుల‌తో పిచికారీ చేస్తున్నారు. తిరుమల లోని ఆరోగ్య విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన‌ కంట్రోల్ రూం 24 గంటల పాటు పని చేస్తుంది. యాత్రికులు 0877 – 2263447  నంబరుకు ఫోన్ చేసి కరోనా వ్యాప్తి  నివారణ చర్యలను తెలుసునేలా చ‌ర్య‌లు చెప‌ట్టారు. 
  
వైద్య విభాగం –
 
అలిపిరి చెక్‌పాయింట్‌, అలిపిరి న‌డ‌క‌మార్గంలోని పాదాల మండ‌పం, శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గం వ‌ద్ద క‌రోనా వ్యాప్తి నివార‌ణ వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి భ‌క్తుల‌కు థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ ద్వారా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. తిరుమ‌ల‌లోని వివిద ప్రాంతాల‌లో ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, డాక్ట‌ర్లు, పారామేడిక‌ల్ సిబ్బంది, మందులు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. ప్రాథ‌మికంగా వైర‌స్ ల‌క్ష‌ణాల‌ను గుర్తిస్తే తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌కుండా రుయా ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డుకు పంపుతున్నారు. 
 
ద‌ర్శ‌న టికెట్ల తేదీల‌ను మార్చుకునే అవ‌కాశం –
 
తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి మే నెల 31వ తేదీ వ‌ర‌కు ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందిన భక్తులకు త‌మ ద‌ర్శ‌న తేదీలు మార్చుకునే వెసులుబాటును, ర‌ద్ధు చేసుకుంటే న‌గ‌దు రీఫండ్ పొందే సౌక‌ర్యాన్ని క‌ల్పించారు. 
 
అదేవిధంగా భ‌క్తులు వేచి ఉండే స‌మ‌యాన్ని త‌గ్గించేందుకు విశేష‌ పూజ, సహస్ర కలశాభిషేకం మరియు వసంతోత్సవం వంటి ఆర్జీత సేవ‌ల‌ను రద్దు చేశారు.
 
విస్తృతం ప్ర‌చారం – 
 
క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు భ‌క్తుల‌లో అవ‌గాహ‌ణ క‌ల్పించేందుకు శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్, రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగాల‌ ద్వారా తిరుమ‌ల‌లోని ముఖ్య కూడ‌ళ్ల‌లోనూ, ర‌ద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల‌లో నిరంత‌రాయంగా ప్ర‌చారం చేస్తున్నారు. 
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.