FULL PREPAREDNESS FOR GARUDA SEVA DAY- TTD EO _ గరుడసేవ నాడు సంతృప్తికరంగా భక్తులకు దర్శన ఏర్పాట్లు- టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
EO INSPECTS BRAHMOTSAVAM ARRANGEMENTS
Tirumala, 14, September 2023: TTD EO Sri AV Dharma Reddy said that all out arrangements were being made for giving devotees satisfactory Srivari Darshan on Garuda seva day, September 22 as part of on-going nine day festivities of the annual Brahmotsavam from September 18- 26.
Speaking to the media on Thursday after an inspection of all arrangements along with officials, the TTD EO said on September 18, the honorable AP CM Sri YS Jaganmohan Reddy will present the official vastram on behalf of AP government.
He said nearly two lakh devotees will be accommodated in the galleries of Mada streets on Garuda seva day. All devotees waiting on Inner Ring Road and Outer Ring Road will be later allowed into galleries through the Supatham Southwest Corner, Govinda Nilaya Northwest gate and northeast gates.
He said Garuda Vahana will be commenced at 7.00 pm and last till 2.00 am the next morning to facilitate everyone. He appealed to devotees to patiently wait for their turn and observe all security restrictions.
He said TTD had made elaborate arrangements for Darshan, stay, security and sanitation. Both CVSO and Tirupati SP were coordinating security arrangements and the and TTD engineering officials were making all necessary arrangements.
Earlier the EO inspected the Vahana Mandapam, Mada Street, Bedi Anjaneya temple, Supatham, Vaikuntam queue complex-2, and other areas and made valuable suggestions to officials.
JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, SVBC CEO Sri Shanmugha Kumar, ASP Sri Muniramaih, CE Sri Nageswar Rao, SE-2 Sri Jagadeswar Reddy, EE Sri Jaganmohan ReddyDE electrical Sri Ravi Shankar Reddy, health officer Dr Sri Devi, VGO Sri Bali Reddy’s and Sri. Giridhar Rao were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
– తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలన
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్నాయని, ఇందులో భాగంగా సెప్టెంబరు 22న గరుడసేవకు విశేషంగా విచ్చేసే భక్తులందరూ సంతృప్తికరంగా వాహనసేవను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సెప్టెంబరు 18న ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. గరుడసేవ నాడు దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని చెప్పారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి 2 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామని తెలియజేశారు. బయట వేచి ఉండే భక్తులు తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలని, అందరికీ గరుడసేవ దర్శనం కల్పిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దర్శనం, బస, భద్రత, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు. భద్రతాచర్యలపై ఇదివరకే సివిఎస్వో, తిరుపతి ఎస్పీ సమీక్ష నిర్వహించారని, ఇంజినీరింగ్ అధికారులు వీరికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు.
ఈవో వెంట జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఏఎస్పీ శ్రీ మునిరామయ్య, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఇఇ శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, డిఇ ఎలక్ట్రికల్ శ్రీ రవిశంకర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఇన్‌చార్జి సిఎంవో డాక్టర్ నర్మద, ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, డెప్యూటీ సిఎఫ్ శ్రీ శ్రీనివాసులు, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్‌రావు తదితరులు ఉన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.