గరుడ పంచమినాడు సుపర్ణునిపై ఊరేగనున్న మలయప్ప
గరుడ పంచమినాడు సుపర్ణునిపై ఊరేగనున్న మలయప్ప
తిరుమల, 09 ఆగష్టు 2013 : ఆగస్టు 11వ తేది ఆదివారంనాడు గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ మలయప్పస్వామివారు సా. 7.00 గం||లకు తమ ఇష్టవాహనమైన స్వర్ణ గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగనున్నారు.
సాధారణంగా బ్రహ్మోత్సవాలలో 5వ రోజు నాటి రాత్రి నిర్వహించే గరుడసేవతో పాటుగా ప్రతి పౌర్ణమినాడు స్వామివారు తిరమాడ వీధులలో గరుడవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
అయితే ఆదివారంనాడు గరుడపంచమి పర్వదిన నేపథ్యంలో శ్రీ మలయప్పస్వామివారు సర్వాభరణ భూషితుడై, పుష్పమాలా అలంకృతుడై ఛత్రచామర సార్వభౌమాధిక మర్యాదలతో తిరుమల నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో తి.తి.దే ఉన్నదాధికారులు పాల్గొంటారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.