MAHA SARASWATHI YAGAM A HUGE HIT AMONG STUDENTS _ గీతా జయంతి మైదానంలో 10 వేల మంది విద్యార్థులతో వైభవంగా మహాసరస్వతియాగం
SHOULD AIM AT STRESS FREE EDUCATION TO LEAD HAPPY LIFE-TTD EO TO STUDENTS
EDUCATION IS AN OCEAN WITHOUT ANY END-LOCAL MLA AND TTD BOARD SPECIAL INVITEE
CONTINUOUS STUDIES WILL REDUCE EXAM PHOBIA-JEO
NEARLY 10THOUSANDS STUDENTS TOOK PART IN THE MAHA SARASWATHI HOMAM
Tirupati, 20 Feb. 20: Apart from the Govinda Namas and Siva Namas, the Temple City of Tirupati reverberated to the rhythmic recitation of Saraswathi Maha Mantra on the bright sunny day on Thursday.
The pilgrim centre echoed to chorus chanting of “Om Sreem Hrim Kleem Maha Saraswatyai-Mahyam Medham Pragyam Pracha” with the tens of thousands of voices chanting the Maha Mantra during the spectacular Maha Sarawathi Yagam organized jointly by Hindu Dharma Prachara Parishad wing and Education Department of TTD in the spacious Geeta Jayanthi grounds.
Speaking on this ceremonious occasion, TTD Executive Officer Sri Anil Kumar Singhal said that TTD has launched skill development training in collaboration with the AP Skill Development corporation for students of TTD educational institutions for enhancing their job opportunities after the completion of their studies. He advised the students to develop “Stress free” education to have a happy, healthy and prosperous career in their lives ahead.
He appreciated the students for enthusiastically participating in the massive programme with devotion, dedication and discipline. “The unique feature about the students studying in TTD institutions is that your passion for Hindu Sanatana Dharma makes you special from other students. I am confident that this Maha Yagam will help you to excel in your public exams. But at the same time, I advise you all to aim at stress-free education which we used have during our times. We enjoyed our studies without feeling stress. This could be possible only when you study every day not just before exams.
The TTD EO said said even the Honourable Prime Minister Sri Narendra Modi had recently focused on the state of mind of students preparing for examinations in his “Mann ki Baat” programme. He wished that the worship of Goddess Saraswati would reduce stress and prepare students to face any challenges in the examinations with courage.
TTD Trust Board Special Invitee and Tirupati MLA Sri Bhumana Karunakar Reddy said the blessings of Goddess Saraswati will enhance the mental stamina, peace and develop concentration among students. “Education is the only property which cannot be looted by anyone or any force. Education is like an ocean without any end. It enhances the ethical values and makes us to become responsible citizens of the society.
Speaking about the Maha Saraswathi Yagam, the local legislator expressed that this Yagam will energize the students physically and mentally and makes them bold enough to overcome their exam phobia.
TTD JEO Sri P Basant Kumar said TTD had brought out a booklet of 19 point booklet to assist students to improve their memory power and enhance their concentration in studies and examinations.
Later HDPP Secretary Acharya Rajagopalan, DEO Dr Ramana Prasad and SV higher Vedic studies institute Project officer Dr Akella Vibhishana Sharma also spoke on this occasion.
Srivari temple Chief Archaka Sri Venugopala Dikshitulu and Vaikhanasa Agama Adviser Sri SK Sundara Varadan, Sri Vedantam Vishnubhattacharya of Rastriya Sanskrit Vidyapeetam and Sri Sitaramacharyulu of Dharmagiri Veda pathasala supervised the yagam.
The students were taught Saraswati mantra and also Saraswati Kankanam notebooks with a pen is presented to every student in a token manner.
SVETA Director Sri Ramanujulu Reddy, All Projects Liaison Officer Sri Venkata Sharma, Principals of TTD colleges, Head Masters of schools, teachers, students participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టిటిడి విద్యాసంస్థల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ : ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
గీతా జయంతి మైదానంలో 10 వేల మంది విద్యార్థులతో వైభవంగా మహాసరస్వతియాగం
ఫిబ్రవరి 20, తిరుపతి, 2020: టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందులోభాగంగా చదువు పూర్తి కాగానే ఉపాధి పొందేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. త్వరలో జరుగనున్న వార్షిక పరీక్షల్లో విద్యార్థిని విద్యార్థులు శ్రీసరస్వతి అమ్మవారి అనుగ్రహంతో విజయం సాధించాలని కోరారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, విద్యా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని గీతాజయంతి మైదానంలో(ఎస్వీ హైస్కూల్ మైదానం) గురువారం సుమారు 10 వేల మంది విద్యార్థులతో మహాసరస్వతి యాగం వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారు శ్రీ ఎన్ఎకె.సుందరవరదన్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు శ్రీ సీతారామాచార్యులు ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన టిటిడి ఈవో మాట్లాడుతూ పలురకాల కారణాల వల్ల ఇటీవల విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, దీన్ని అధిగమిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. గౌ. ప్రధానమంత్రివర్యులు కూడా ఆకాశవాణిలో మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పరీక్షల సమయంలో విద్యార్థులకు సూచనలిస్తున్నారని తెలియజేశారు. శ్రీ సరస్వతి అమ్మవారిని ప్రార్థిస్తే జ్ఞానం, ధైర్యం అలవడతాయని, మానసిక ప్రశాంతతతో పరీక్షలు రాయవచ్చని తెలిపారు. టిటిడి విద్యాసంస్థల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులే ఎక్కువగా ఉంటారని, వీరికి నాణ్యమైన విద్యను అందించడంతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహిస్తున్నామని వివరించారు. గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. విద్యార్థులు సనాతన ధర్మంపై అవగాహన పెంచుకుని యోగా, ప్రాణాయామం సాధన చేయాలని, భగవంతుని స్మరించాలని, మంచి అలవాట్లను పెంచుకోవాలని సూచించారు. ధర్మప్రచారంలో భాగంగా ఇలాంటి యాగాలను ఇతర ప్రాంతాల్లోనూ నిర్వహిస్తామని తెలిపారు.
తిరుపతి శాసనసభ్యులు, టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ చదువుల తల్లి శ్రీ సరస్వతి అమ్మవారి ఆశీస్సుల కోసం టిటిడి ఈ యాగం నిర్వహిస్తోందని, దీనివల్ల మానసిక స్థైర్యం, చదువుపై నిబద్ధత పెరుగుతాయని అన్నారు. అధికారం, ధనం తాత్కాలికమని, విద్య ద్వారా వచ్చే జ్ఞానం శాశ్వతమైందని తెలిపారు. శ్రీ సరస్వతి అమ్మవారి అనుగ్రహంతో కేవలం వాక్కు ద్వారా వేదం వేలాది సంవత్సరాల పాటు నిలిచి ఉందన్నారు. నన్నయ్య, పోతన, న్యూటన్, డార్విన్, సోక్రటీస్ లాంటి మహానుభావులు విద్యను తపస్సుగా భావించి చరిత్రలో నిలిచిపోయారని వివరించారు. విద్య కేవలం పరీక్షల కోసం కాదని విజ్ఞానం కోసమని తెలియజేశారు. అనంతరం ఆరంబించరు నీచ మానవుల్… అనే పద్యాన్ని పఠించి దాని అర్థాన్ని తెలియజేశారు.
టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ మాట్లాడుతూ జీవితంలో బ్రహ్మచర్యం, గృహస్తం, వానప్రస్తం ఆశ్రమధర్మాలను తప్పకుండా పాటిస్తే ఉన్నతస్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఇష్టపడి చదవాలని, రాయడం సాధన చేయడం ద్వారా పరీక్షలను సులువుగా ఎదుర్కోవచ్చని తెలియజేశారు. లక్ష్యసాధన కోసం 19 సూత్రాలతో కూడిన నోటు పుస్తకాలను అందించామని, ప్రతి ఒక్కరూ వీటిని పాటించాలని కోరారు. చదువుతోపాటు ఆటపాటలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. అనంతరం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య కె.రాజగోపాలన్, విద్యాశాఖాధికారి డా. ఆర్.రమణప్రసాద్, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ ప్రసంగించారు.
సరస్వతి మంత్రం ఉపదేశం
ముందుగా ఉదయం 6 గంటలకు అనుజ్ఞ, పుణ్యాహం నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు సరస్వతీ దేవి ఆరాధన, కలశారాధన, నివేదన చేపట్టి 6 హోమగుండాల్లో మహాసరస్వతీ యాగాన్ని ప్రారంభించారు. అధికారుల సందేశాల అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సరస్వతి మంత్రాన్ని ఉపదేశించి విద్యార్థిని విద్యార్థుల చేత పలికించారు. అనంతరం సరస్వతి కంకణం, నోటు పుస్తకం, ఒక పెన్ను, ప్రసాదాన్ని విద్యార్థులకు అందించారు.
ఈ కార్యక్రమంలో విఎస్‌వో శ్రీ ప్రభాకర్‌రావు, శ్వేత సంచాలకులు శ్రీ రామాంజులురెడ్డి, ప్రాజెక్టుల లైజాన్ ఆఫీసర్ శ్రీ వెంకటశర్మ, హెచ్‌డిపిపి ఏఈవో శ్రీ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ శ్రీ గురునాథం, ఎవిఎస్వో శ్రీ నందీశ్వరరావు, టిటిడి కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.