PARAKAMANI ACTIVITIES REVIEWED _ ప‌ర‌కామ‌ణి విభాగంపై అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష

Tirumala, 20 Feb. 20: The activities and issues related to Parakamani were reviewed by TTD Additional EO Sri AV Dharma Reddy on Thursday at Gokulam Conference Hall in Tirumala. 

Deputy EO Sri Venkataiah presented the activities and issues related to Parakamani though power point presentation. 

Later the Addl. EO discussed with Bankers about status of lifting of coin currency, currency notes and also reviewed on Foreign currency, soiled notes etc.

He also instructed the Engineering wing to replace the old Parakamani machinery with new ones. 

FACAO Sri Balaji, SE 2 Sri Nageswara Rao, HoD IT and Transport Sri Sesha Reddy, various bank representatives participated. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

                                           
ప‌ర‌కామ‌ణి విభాగంపై అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష

 ఫిబ్రవరి 20, తిరుమల 2020 ;టిటిడి ప‌ర‌కామ‌ణి విభాగంపై తిరుమ‌ల అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గురువారం తిరుమ‌ల‌లోని గోకులం విశ్రాంతి గృహంలో గ‌ల స‌మావేశ మందిరంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ నాణేలు, క‌రెన్సీని ఎప్ప‌టిక‌ప్పుడు సేక‌రించి త‌ర‌లించేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై బ్యాంకుల అధికారులకు  ప‌లు సూచ‌న‌లు చేశారు. భ‌క్తులు రోజువారీ హుండీలో స‌మ‌ర్పిస్తున్న నాణేలు, క‌రెన్సీ, విదేశీ కరెన్సీ, విదేశీ నాణేలు, క‌ట్ నోట్లు, సాయిల్డ్ నోట్లు మొదలైనవి పూర్తిగా సేక‌రించి త‌ర‌లించేందుకు బ్యాంకులు ముందుకు రావాల‌ని కోరారు. పరకామణిలో ఉన్న పాత యంత్రాల స్థానంలో అత్యాధునిక‌ యంత్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. 

అంత‌కుముందు ప‌ర‌కామ‌ణి విభాగం డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య పవర్ పాయింట్ ప్ర‌జంటేషన్ ద్వారా పరకామణికి సంబంధించిన కార్యకలాపాలను వివ‌రించారు.

ఈ స‌మీక్ష స‌మావేశంలో ఎఫ్ఏఅండ్‌సిఏవో  శ్రీ ఓ.బాలాజి, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వరరావు, ఐటి మరియు రవాణా విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, వివిధ బ్యాంకుల‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.