ఘనంగా అన్నమయ్య తిరునక్షత్రం
ఘనంగా అన్నమయ్య తిరునక్షత్రం
తిరుపతి, 2012 సెప్టెంబరు 20: పదకవితా పితామహుడు, హరి సంకీర్తనాచార్యుడుగా శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు వైశాఖమాసం విశాఖానక్షత్రాన శ్రీనివాసుని యొక్క నందకాంశతో జన్మించారు. తితిదే అన్నమయ్య జన్మనక్షత్రమైన విశాఖానక్షత్రాన్ని పురస్కరించుకొని గురువారం నాడు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య తిరునక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటలకు సప్తగిర సంకీర్తనలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు తిరుపతికి చెందిన డాక్టర్ కట్టమంచి మహాలక్ష్మి గారిచే ‘అన్నమయ్య సంకీర్తనల్లోని భక్తితత్వం’ పై ఉపన్యాసం, 11.30 గంటలకు తిరుపతికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ కె.వెంకటక్రిష్ణయ్య గారిచే హరికథా పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ మేడసాని మోహన్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.వాణి, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.