SPORTS FOR ENHANCED PHYSICAL AND MENTAL STRENGTH _ ఘనంగా టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు-2023 ప్రారంభం

TIRUPATI, 02 FEBRUARY 2023: “Sports will not only strengthen the physical and mental fitness of the body but also improves the “Spirit of Service” which is very much essential for the TTD employees TTD EO Sri AV Dharma Reddy.

 

After inaugurating the TTD Employees’ Annual Sports Meet 2023 at the Parade Grounds behind TTD Administrative Building in Tirupati on Thursday by unveiling the National and Sports flag, the EO in his address to employees said that “TTD is one of the most important organisations in the entire world that functions 24X7 throughout the year. If you participate in the sports meet, it will refresh your physical and mental abilities, with which you can execute your duties with more enthusiasm and offer better services to the multitude of visiting pilgrims”, he asserted.

 

Earlier, the EO also flew off the sparrows and took the Honor Salute from the participants of Parade March.

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CEO SVBC Sri Shanmukh Kumar, VSO Sri Manohar and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

శారీరక ఆరోగ్యంతోనే మానసిక ఆరోగ్యం- టిటిడి ఉద్యోగుల ఆటలపోటీల ప్రారంభోత్సవంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
 
తిరుపతి, 2023 ఫిబ్రవరి 02: ఉద్యోగులు ఆటలపోటీలు జరిగే సమయంలోనే కాకుండా ప్రతిరోజూ యోగా, ధ్యానం, ఆటలు, వ్యాయామం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యవంతులుగా ఉంటారని, తద్వారా మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి చెప్పారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పరేడ్‌ మైదానంలో గురువారం ఆయన ఉద్యోగుల ఆటలపోటీలను ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా జరిగిన సభలో ఈవో మాట్లాడుతూ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉన్నపుడే మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించవచ్చని చెప్పారు. తద్వారా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించి సంస్థ ప్రతిష్టను ఇనుమడింప చేయవచ్చునన్నారు.
 
ముందుగా ఈవో ఉద్యోగుల గౌరవ వందనం స్వీకరించి పావురాలు, బెలూన్లు ఎగురవేసి ఆటలపోటీలు ప్రారంభమైనట్టు ప్రకటించారు. తరువాత వాలీబాల్‌ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ వరకు నిర్వహిస్తారు.
 
జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్‌,  చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు, విజివో శ్రీ మనోహర్‌, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.