KUPCHANDRAPETA UTSAVAM HELD _ ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

Tirupati, 26 February 2024: The annual Kupchandrapeta  Utsavam of Tirupati Sri Kodandarama Swami was celebrated on Sunday. 

On the next day of Magha Pournami, it is customary to take the ceremonial idols of Sri Kodandaramaswami along with Sri Seethalakshmana in a procession to Kupuchandrapeta village near Tirupati.

As part of this, a procession of Utsavamurtis reached Kupuchandrapeta, 8 km from Tirupati. 

Snapana Tirumanjanam was held there followed by Unjal seva in the evening.

After that the village festival was held and the deities returned to the temple.

Both the Tirumala pontiffs, DyEO Smt Nagaratna and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

తిరుపతి, 2024 ఫిబ్రవరి 25: తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి పేట ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి మరుసటి రోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు బయల్దేరింది. ఉదయం 9.30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళు, పసుపు, చందనంతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం ఊంజల్‌సేవ చేపట్టారు. ఆ తరువాత గ్రామోత్స‌వం నిర్వ‌హించి ఆలయానికి చేరుకున్నారు.

ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, టీటీడీ శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.