ఘనంగా శ్రీ విఖనస మహర్షి జయంతి

ఘనంగా శ్రీ విఖనస మహర్షి జయంతి

తిరుమల, 2023 ఆగస్టు 30: తిరుమల ఆస్థాన మండపంలో బుధవారం శ్రీ విఖనస మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు.

శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ విఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీ గంజాం ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ విఖనస మహర్షి సూత్రీకరించిన విధివిధానాలతోనే శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు జరుగుతున్నాయని తెలిపారు. మానవుల జీవితం భగవంతుని దర్శనంతో సంస్కారవంతం అవుతుందని చెప్పారు. అనంతరం బెంగళూరుకు చెందిన శ్రీ పెద్దింటి విజయ్, టీటీడీ పంచాంగం పరిష్కర్త శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ఉపన్యసించారు.

ఈ కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, శ్రీ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.