GRAND ARADHANOTSAVAM OF SADGURU SRI THYAGARAYA HELD _ ఘనంగా సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవం
Tirupati, 15 January 2020: The 173rd Aradhana Mahotsavam of the saint- musician Sri Sadguru Thyagaraja Swamy celebrated by SV College of Music and Dance of TTD on the occasion of Pushya bahula Panchami on Wednesday.
The rendering of melodious Pancha Ratna sankeertans of Ghanaraga presented by students, faculty and Carnatic music exponents, alumni participated.
Along with singers the instrumentalists also added gaiety and melody to the group event.
Special pujas for idols Sri Vinayaka, Sri Sitarama Lakshmana Hanumanta were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఘనంగా సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవం
తిరుపతి, 2020, జనవరి 15: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర పాఠశాల ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి 173వ ‘పుష్యబహుళ పంచమి’ ఆరాధనోత్సవం బుధవారం కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీత్యాగరాజస్వామివారి ఘనరాగ పంచరత్నకృతుల బృందగానం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల, నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విశ్రాంత అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, తిరుపతికి చెందిన పలువురు సంగీత విద్వాంసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉదయం 9.00 గంటలకు ఎస్వీ సంగీత కళాశాల ప్రాంగణంలోని శ్రీవినాయకుడు, శ్రీసీతారామలక్ష్మణులు, హనుమంతుడు, శ్రీ త్యాగరాజస్వామివారి పంచలోహ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మైమరపించిన శ్రీత్యాగరాజస్వామివారి పంచరత్న కీర్తనల బృందగానం –
సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి 173వ ‘పుష్యబహుళ పంచమి’ ఆరాధనోత్సవం సందర్భంగా నిర్వహించిన ఘనరాగ పంచరత్నకృతుల బృందగానం సంగీతప్రియులను మంత్రమగ్ధులను చేసింది.
ఈ సందర్భంగా నాట రాగం, ఆది తాళంలో ‘జగదానందకారక జయజానకి ప్రాణనాయక….’, గౌళరాగం, ఆదితాళంలో ‘దుడుకుగల నన్నేదొర కొడుకు బ్రోచురా…’, ఆరభి రాగం, ఆదితాళంలో ‘సాధించెనే ఓ మనసా(సమయానికి తగు మాటలాడెనె!)…’, వరాళి రాగం, ఆదితాళంలో ‘కనకనరుచిరా! కనక వసన నిన్ను…’, శ్రీరాగం, ఆదితాళంలో ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు…’ ఐదు పంచరత్న కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. గాత్ర సంగీత కళాకారులతో పాటు వీణ, వయోలిన్, వేణువు, మృదంగం తదితర అన్ని వాయిద్యాల కళాకారులు బృందగానంలో అత్యద్భుతంగా సహకారం అందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జమున రాణి, కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన, శ్రీ సుధాకర్, శ్రీమతి చిన్నమదేవి, శ్రీమతి జ్ఞానప్రసూన, శ్రీ కృష్ణ, శ్రీ రమేష్, స్థానిక సంగీత కళాకారులు, కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థిని విద్యార్థినులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.