చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి, 2022 ఏప్రిల్ 05: చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 10 నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.  అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీసుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణ చైత‌న్య పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.