CHANDRA PRABHA VAHANAM HELD _ చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వైభవం
TIRUPATI, 17 JUNE 2022: On the pleasant evening on Thursday, Sri Prasanna Venkateswara as Navaneeta Krishna blessed His devotees.
Deputy EO Sri Lokanatham and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వైభవం
తిరుపతి, 2022 జూన్ 16: అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం రాత్రి స్వామివారు నవనీత కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర భగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు. ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తాడు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ ప్రధాన అర్చకులు మరియు కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.