TUDA CHIEF TAKES OATH AS TTD EX-OFFICIO _ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ప్ర‌మాణస్వీకారం

TIRUMALA, 16 JUNE 2022: TUDA Chairman Dr C Bhaskar Reddy has taken oath as TTD ex-officio member in Tirumala temple on Thursday evening.

The oath was administered by TTD EO Sri AV Dharma Reddy in the presence of Sri Venkateswara Swamy.

After darshan along with his family, he was rendered Vedaseervachanam by Vedic Pundits.

Later he was offered Srivari Theertha Prasadams, lamination photo, coffee table book on TTD.

Deputy EOs Sri Ramesh Babu, Smt Kasturi Bai, VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ప్ర‌మాణస్వీకారం

తిరుమల, 2022 జూన్ 16: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా తుడ ఛైర్మ‌న్ డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత టిటిడి ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. డా.చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం ఈవో శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు, చిత్ర‌ప‌టాన్ని అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ శ్రీమతి క‌స్తూరిబాయి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, విజిఓ శ్రీ బాలిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.