BALALAYA MAHA SAMPROKSHANAM CONCLUDE _ చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో ఘనంగా ముగిసిన మహాసంప్రోక్షణ
Chandragiri, 25 Oct. 19: Astabandhana Balalaya Maha Samprokshanam was concluded on a ceremonious note in Sri Kodanda Ramalayam at Chandragiri.
The five day fete concluded with Maha purnahuti on Friday.
Temple Priest Sri Manikantha Bhattar, DyEO Sri Subramanyam and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో ఘనంగా ముగిసిన మహాసంప్రోక్షణ
తిరుపతి, 2019 అక్టోబరు 25: చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో శుక్రవారం మహాసంప్రోక్షణ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 10.30 గంటల వరకు ద్వారా పూజ, మహా శాంతి హోమం, మహా శాంతి అభిషేకం, పూర్ణాహుతి, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఆలయంలో మూడు రోజుల పాటు బాలాలయ జీర్ణోద్ధరణ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. చివరి రోజు పూర్ణాహుతితో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ముగిసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ మణికంఠ బట్టర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీసుబ్రమణ్యం, ప్రధాన కంకణబట్టర్ శ్రీ కృష్ణబట్టర్, సూపరింటెండెంట్ శ్రీ కృష్ణారావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణ చైతన్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.