ACTION PLAN FOR INFANTS HEART TRANSPLANTS TOO IN PAEDIATRIC HOSPITAL _ చిన్నపిల్లల గుండెమార్పిడి ఆపరేషన్ల నిర్వహణకు ప్రణాళికలు
DESI COW BREEDING CENTRE SOON
Dr KS JAWAHAR REDDY- SPECIAL CS
Tirupati,14 June 2022: Dr KS Jawahar Reddy, Special CS, CMO has urged TTD officials to prepare an action plan for carrying out heart transplantation operations too at Sri Padmavati Hridayalaya Paediatric Hospital in the next three months.
He was Interacting via the virtual platform from his office in Tadepalli with TTD top brass who included EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, FACAO Sri Balaji, CE Sri Nageswar Rao and others on Tuesday.
Speaking on the occasion Dr Reddy said that the Children hospital got up with a special focus of Honourable AP CM Sri YS Jaganmohan Reddy had in the last six months completed 400 heart surgeries at the rate of 20 operations per week.
Dr Reddy urged officials to step up activities to complete the ongoing development works in the new building of the hospital.
The former TTD EO has also said TTD should take lead to set up a model Desi Cow Breeding Centre with the coordination of all Goshalas across the state making them as satellite Goshalas integrating them with SV Goshala.
He instructed officials to complete exercise to gather desi cows from all over the country by December this year so as to provide 4000 litters of milk and ghee for the Srivari temple routine and also speed up works in setting up ghee making Plant.
Among others, he also advised TTD officials to donate cows to organic farmers and avoid sending animals to abattoirs, launch production at Ayurveda pharmacy by August 15, provide 20% discounts on the sale of TTD Panchagavya products, sell TTD products online and also complete fodder plant at SV Goshala on a war footing.
He said to promote environment protection in Tirumala, 50 electric buses plying between Tirumala-Tirupati will be launched by APSRTC from September and another 50 buses from November onwards. Even free electric buses should be operated at Tirumala.
In order to conserve energy, Dr Reddy also asked TTD officials for setting up meters at all rest houses in Tirumala and the TTD engineering department should adopt the Mbook system at the earliest.
He also instructed officials to speed up design work for the construction of the Srivari temple at Mumbai, achieve NAAC recognition to TTD colleges, complete student information system app, process house site allotment for TTD employees by depositing required funds with government.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చిన్నపిల్లల గుండెమార్పిడి ఆపరేషన్ల నిర్వహణకు ప్రణాళికలు
– దేశీయ గోజాతి అభివృద్ధి కేంద్రం ఏర్పాటు
– టిటిడి అధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి సమీక్ష
తిరుపతి, 2022 జూన్ 14: శ్రీ పద్మావతి హృదయాలయంలో చిన్నపిల్లల గుండె మార్పిడి ఆపరేషన్లు కూడా నిర్వహించడానికి మూడు నెలల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి మంగళవారం ఆయన టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధతో ఏర్పాటుచేసిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఆరు నెలల్లో 400 గుండె ఆపరేషన్లు పూర్తి చేశారని చెప్పారు. ప్రస్తుతం వారానికి 20 ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలను త్వరగా ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అవసరాలకు రోజుకు కావాల్సిన 4 వేల లీటర్ల పాలు, శ్రీవారి ఆలయానికి అవసరమైన నెయ్యి దేశీయ గోవుల నుండి సేకరించడం కోసం గోవుల సేకరణ ప్రక్రియ డిసెంబరు నాటికి పూర్తి చేయాలని డాక్టర్ జవహర్‌రెడ్డి సూచించారు. దీంతోపాటు నెయ్యి తయారీ ప్లాంట్‌ను కూడా డిసెంబరులో ప్రారంభించడానికి పనులు వేగవంతం చేయాలన్నారు. టిటిడి ఆధ్వర్యంలో ఆదర్శ దేశీయ గోజాతి అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని గోశాలలను శాటిలైట్ గోశాలలుగా తయారుచేసి వీటిని ఎస్వీ గోసంరక్షణశాలకు అనుసంధానం చేయాలని సూచించారు. తద్వారా గోవులు కబేళాలకు పోకుండా కాపాడవచ్చని, వీటిని రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా అందించవచ్చని తెలిపారు. టిటిడి ఆయుర్వేద ఫార్మశీ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి యంత్రాలను సమకూర్చుకుని ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రారంభించాలన్నారు. పంచగవ్య ఉత్పత్తులపై 20 శాతం వరకు రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, ఆన్‌లైన్ ద్వారా వీటి అమ్మకాలు పెంచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎస్వీ గోశాలలో ఫీడ్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఏపిఎస్ఆర్‌టిసి సెప్టెంబరులో 50 విద్యుత్ బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేస్తోందని, నవంబరుకు మరో 50 బస్సులు తిరుపతి – తిరుమల మధ్య నడుస్తాయని చెప్పారు. తిరుమలలో యాత్రికుల కోసం నడుపుతున్న ఉచిత బస్సుల స్థానంలో కూడా విద్యుత్ బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించి ఆదా చేయడం కోసం ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. తిరుమలలో అతిథిగృహాలకు విద్యుత్ మీటర్లు ఏర్పాటుచేసే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ-ఎంబుక్ విధానం చాలా బాగుందని, దీన్ని టిటిడి ఇంజినీరింగ్ విభాగంలో పూర్తిస్థాయిలో అమలుచేయడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు.
ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. టిటిడి కళాశాలలకు న్యాక్ గుర్తింపు పొందేందుకు అవలంబిస్తున్న విధానం బాగుందని, దీన్ని అన్ని కళాశాలలకు అమలుచేయాలని సూచించారు. టిటిడి విద్యాసంస్థల్లో ఏర్పాటుచేయ తలపెట్టిన స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం ప్రభుత్వానికి సొమ్ము చెల్లించిన భూమిని త్వరగా స్వాధీనం చేసుకుని ఇంటిస్థలాలు కేటాయించే పని ప్రారంభించాలన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.