CHINNA SESHA VAHANAM HELD _ చిన్నశేషవాహనంపై శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి

TIRUPATI, 11 JUNE 2022: As a part of the ongoing annual Brahmotsavams in Appalayagunta Chinna Sesha Vahanam was observed on Saturday.

DyEO Sri Lokanatham, Superintendent Smt Srivani and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చిన్నశేషవాహనంపై శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి

తిరుపతి, 2022 జూన్ 11: అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో స్వామి వారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరం..

వాహ‌న‌సేవ‌లో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి శ్రీ‌వాణి, కంకణభట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల