LEOPARD ATTACKED BOY KAUSHIK DISCHARGED _ చిరుత దాడిలో గాయపడిన చిన్నారిని శ్రీవారే రక్షించారు – టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

INJURED BOY SAVED BY SRIVARU-  SAYS TTD CHAIRMAN

 

Tirupati, 07 July 2023: The three-year-old Kaushik who got injured in a leopard attack on Alipiri footpath route on the night of June 22  got discharged on Friday from the hospital after complete recovery.

 

The TTD chairman said the injured boy was rushed to Sri Padmavati Children’s Hospital where he was treated by a team of expert doctors for 14 days.

 

Speaking to reporters he said the boy got saved with the blessings of Srivaru and the leopard was later trapped by the Forest officials and released in deep forest.

 

The TTD officials are directed to take all necessary steps and ensure that such incidents should not recur.

 

The parents of the boy, Sri B Pulikonda and Smt B Shirisha hailed from Adoni in Kurnool district said with the blessings of Lord Venkateshwara and with the timely gesture of TTD EO Sri AV Dharma Reddy along with hus officials had reached the spot within fifteen minutes and shifted the injured boy to the hospital without delay.

 

They thanked the EO, officials and the doctors for all the help, treatment in the hospital.

 

TTD JEO (H&E) Smt Sada  Bhargavi, hospital Director Dr Srinath Reddy and RMO Dr Bharat were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

చిరుత దాడిలో గాయపడిన చిన్నారిని శ్రీవారే రక్షించారు

– టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

– పూర్తి ఆరోగ్యంతో చిన్నారి కౌశిక్‌ డిశ్చార్జి

తిరుపతి, 2023 జూలై 07: అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్‌ను శ్రీవారే రక్షించారని టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. 14 రోజుల చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో ఉన్న చిన్నారిని శుక్రవారం ఛైర్మన్‌ సమక్షంలో వైద్యులు డిశ్చార్జి చేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడారు. జూన్‌ 22న రాత్రి చిన్నారిపై చిరుత దాడి జరిగిందని, టీటీడీ అధికారులు వెంటనే స్పందించి శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో బాలుడికి చికిత్స జరిగిందని వివరించారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. అటవీ శాఖ సహకారంతో చిరుతను బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టామని చెప్పారు. నడకమార్గాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని తెలియజేశారు.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బాలుడి తల్లిదండ్రులు శ్రీ బి.పులికొండ, శ్రీమతి బి.శిరీష మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయతోనే తమ బిడ్డ ప్రాణాలతో దక్కాడని సంతోషం వ్యక్తం చేశారు . స్వామి వారికి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అలాగే చిరుత దాడి జరిగిన 15 నిమిషాల్లో టీటీడీ ఈవో శ్రీఎవి.ధర్మారెడ్డితోపాటు ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని తమ బిడ్డను చిన్నపిల్లల అసుపత్రికి తరలించారని చెప్పారు. వీరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నామని చెప్పారు . ఆసుపత్రిలో వైద్యులు ఎంతో ఓపికగా మెరుగైన వైద్యం అందించి పూర్తి ఆరోగ్యంతో తమ బిడ్డను తిరిగి అప్పగించారని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యం చక్కగా చేస్తున్నారని, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉందని చెప్పారు. ఉచితంగా తమ బిడ్డకు వైద్యం అందించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథరెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.